Faria Abdullah: అలాంటి వ్యక్తి భర్తగా రావాలంటున్న చిట్టి.. ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోటోస్ వైరల్..
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఫరియా అబ్దుల్లా. అనుదీప్ కేవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన ఫరియా.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో తనదైన నటనతో అలరించింది ఫరియా. జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా గుర్తిండిపోయిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. రావణసుర, బంగార్రాజు వంటి చిత్రాలతో మెప్పించిన ఫరియా.