Kitchen Hacks: ఈ టిప్స్ పాటించారంటే.. జిడ్డుపట్టిన మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
గ్యాస్ స్టవ్ మీద వంట చేయడం ఈజీగానే ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. కానీ స్టవ్ మీ పడ్డ మొండి మరకలను క్లీన్ చేసేటప్పుడు మాత్రం.. చుక్కలు కనిపిస్తాయి. వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ మరకలు, పిండి మరకలు, కూరలు ఒలికిపోవడం, అన్నం పొంగి పోవడం, పాలు, పప్పు.. ఇలా చాలా రకాల మరకలు పడుతూ ఉంటాయి. ఈ మరకలు అంత ఈజీగా క్లీన్ అవ్వవు. స్టవ్‌ని క్లీన్ చేయాలంటే..

గ్యాస్ స్టవ్ మీద వంట చేయడం ఈజీగానే ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. కానీ స్టవ్ మీ పడ్డ మొండి మరకలను క్లీన్ చేసేటప్పుడు మాత్రం.. చుక్కలు కనిపిస్తాయి. వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ మరకలు, పిండి మరకలు, కూరలు ఒలికిపోవడం, అన్నం పొంగి పోవడం, పాలు, పప్పు.. ఇలా చాలా రకాల మరకలు పడుతూ ఉంటాయి. ఈ మరకలు అంత ఈజీగా క్లీన్ అవ్వవు. స్టవ్‌ని క్లీన్ చేయాలంటే.. మహిళలకు సవాలే అని చెప్పొచ్చు. కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం.. స్టవ్‌ని చాలా తక్కువ సమయంలోనే క్లీన్ చేయవచ్చు. గ్యాస్ స్టవ్‌ని క్లీన్ చేయడానికి ఇక్కడ చెప్పే కొన్ని చిట్కాలు చాలా అద్భుతంగా పని చేస్తాయి. వీటితో మీరు ఇంటిని కూడా క్లీన్ చేసుకుంటే.. చాలా శుభ్రంగా ఉంటాయి. మరి ఆ టిప్స్ ఏంటి? ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ వెనిగర్:
గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడంలో వైట్ వెనిగర్ చక్కగా సహాయ పడుతుంది. వెనిగర్‌తో మొండి మరకలను చాలా సులభంగా వదిలించవచ్చు. గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి రెండు కప్పుల నీటిలో రెండు స్పూన్ల వైట్ వెనిగర్ వేసి బాగా కలపండి. ఇలా తయారైన నీటిని.. గ్యాస్ స్టవ్ మీద స్ప్రే చేయండి. ఓ ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే మొండి మరకలు పోతాయి. ఇందులో సర్ఫ్ కూడా కలిపి ఉపయోగించవచ్చు.
ఉప్పు – బేకింగ్ సోడా:
గ్యాస్ స్టవ్‌ని క్లీన్ చేయడంలో ఉప్పు, బేకింగ్ సోడా కూడా చక్కగా పని చేస్తాయి. ఈ రెండింటినీ సమానంగా తీసుకోండి. ఇందులో కొద్దిగా నీళ్లు కలుపుతా.. పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టుతో గ్యాస్ స్టవ్‌ని క్లీన్ చేస్తే.. త్వరగా వదిలిపోవడమే కాకుండా.. స్టవ్ కొత్తదానిలా మెరుస్తుంది.
బేకింగ్ సోడా – నిమ్మకాయ:
గ్యాస్ స్టవ్ మీద ఉండే మొండి మరకలు, జిడ్డు మరకలను త్వరగా వదిలించేందుకు బేకింగ్ సోడా, నిమ్మ కాయ చక్కగా పని చేస్తాయి. ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో రెండు సూన్ల బేకింగ్ సోడా, ఓ నిమ్మకాయ పిండి, ఇందులో ఓ గ్లాస్ వాటర్ పోసి బాగా కలపండి. దీంతో గ్యాస్ స్టవ్ మీద పడ్డ మొండి మరకలే కాకుండా.. మీ ఇంట్లో ఫ్లోరింగ్‌ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమంతో జిడ్డు పాత్రలు కూడా శుభ్రపరిస్తే.. తెల్లగా మెరుస్తాయ్.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








