AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raisin Water: ఎండు ద్రాక్ష నీరు ఇలా తాగారంటే.. కేవలం 10 రోజుల్లోనే ఆ సమస్యలన్నీ పరార్..!

ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. అధిక బరువు కారణంగా చాలా మంది అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వెయిట్ లాస్ అయ్యేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, వాకింగ్, హెల్దీ డైట్, జిమ్ ఇలా చాలానే ట్రై చేస్తున్నారు. అయితే కొన్ని రకాల సింపుల్ చిట్కాలతో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లాస్ అయ్యేందుకు ఎండు ద్రాక్ష వాటర్..

Raisin Water: ఎండు ద్రాక్ష నీరు ఇలా తాగారంటే.. కేవలం 10 రోజుల్లోనే ఆ సమస్యలన్నీ పరార్..!
చాలా మంది మహిళలకు సాధారణ సమస్య రక్తహీనత. ప్రతి రోజూ ఉదయాన్నే నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ఎండుద్రాక్ష హిమోగ్లోబిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నానబెట్టిన ఎండుద్రాక్షను ప్రతిరోజూ తింటే మలబద్ధకం నయమవుతుంది.
Chinni Enni
| Edited By: Janardhan Veluru|

Updated on: May 20, 2024 | 5:44 PM

Share

ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. అధిక బరువు కారణంగా చాలా మంది అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వెయిట్ లాస్ అయ్యేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, వాకింగ్, హెల్దీ డైట్, జిమ్ ఇలా చాలానే ట్రై చేస్తున్నారు. అయితే కొన్ని రకాల సింపుల్ చిట్కాలతో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లాస్ అయ్యేందుకు ఎండు ద్రాక్ష వాటర్ ఎంతగానో సహకరిస్తుంది. ప్రతిరోజూ ఎండు ద్రాక్ష నీరు తాగుతూ, మంచి డైట్ మెయిన్ టైన్ చేస్తూ.. వ్యాయామం చేస్తే మీకు కేవలం 10 రోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. ఇలాంటి వాటర్ తాగడం వల్ల మీ బాడీ కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటుంది. మరి ఇంకా ఎండు ద్రాక్ష నీటిని తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది:

ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల శరీరం డీటాక్సిఫై అవుతుంది. రోజు వారీ జీవితంలో మనకు తెలియకుండానే కాలుష్యం, తినే ఆహారం ఇలా రకరకాల కారణాల వల్ల శరీరంలో మలినాలు అనేవి చేరతాయి. కాబట్టి ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు బయటకు పోతాయి. శరీరం ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి కూడా లభిస్తుంది.

నిద్ర లేమి సమస్యలను దూరం చేస్తుంది:

బరువు పెరిగేందుకు నిద్ర లేమి సమస్యలు కూడా ఒక కారణంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోతే.. తిన్నది అరగక.. పొట్టలో కొవ్వు అనేది నిల్వ ఉండిపోతుంది. అంతే కాకుండా గ్యాస్ అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఎండు ద్రాక్ష నీటిని తాగితే నిద్ర లేమి సమస్యల్ని దూరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రోలైట్ సమతుల్యత:

ఎండు ద్రాక్ష నీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటివి లభ్యమవుతాయి. ఇవి శరీరంలోని ద్రవాల స్థాయిల్ని కంట్రోల్‌లో ఉంచుతుంది. చెమట వల్ల కోల్పోయిన శక్తి ఈ నీళ్ల వల్ల తిరిగి వస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు, కండరాల తీరును సరి చేస్తుంది.

గట్ హెల్త్:

ఎండు ద్రాక్ష నీరు తాగడం వల్ల గట్ హెల్త్ కూడా మెరుగు పడుతుంది. శరీరంలో నుంచి మలినాలన్నీ బయటకు పంపుతుంది. ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ జీర్ణ శక్తిని, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

వెయిట్ లాస్:

ఎండు ద్రాక్ష నీరు తాగడం వల్ల తక్కువ రోజుల్లోనే బరువు తగ్గుతారు. ఎండు ద్రాక్ష నీటిలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. కాబట్టి ఈ నీటిని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. గోరు వెచ్చటి నీటిలో 3 లేదా 4 ఎండు ద్రాక్షను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీటిని తాగి ఎండుద్రాక్ష తినాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..