Chanakya Niti: అమ్మాయిలో అందం, డబ్బు కంటే ఈ 5 గుణాలు చూసి పెళ్లి చేసుకున్న పురుషుడి జీవితం స్వర్గమేనట..
పెళ్లి తర్వాత దంపతుల జీవితం మునుపటి కంటే అందంగా ఉండాలి. అయితే పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా సాగాలని ఉత్తమ జీవిత భాగస్వామి లభించాలని రూల్ ఏమీ లేదు. అదే సమయంలో కొంతమంది పురుషులు.. తాము పెళ్లి చేసుకోవాలనుకునే యువతిలో మంచి గుణాలు చూడడానికి కంటే.. అందం, డబ్బులు, బంగారం ఆస్తులను చూస్తారు. అటువంటి అమ్మాయిని జీవిత భాగస్వామిగా కావాలని కోరుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. ఈ నేపధ్యంలో చాణక్య నీతిలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న యువతిని పెళ్లి చేసుకున్న పురుషుడి జీవితం సుఖ సంతోషాలతో స్వర్గంలా ఉంటుందని వివరించాడు.
తక్ష శిలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆచార్య చాణక్యుడు అపర మేథావి. రాజనీతిజ్ఞుడు. జీవితంలోని ప్రతి రంగంలో అపార జ్ఞానవంతుడు. చాణుక్యుడు రాసిన నీతి శాస్త్రంలో మనవ జీవితానికి సంబంధించిన మంచి చెడులను గురించి వివరించాడు. జీవితంలో ఏ పనులు చేస్తే విజయాన్ని పొందవచ్చు. సుఖ సంతోషాలతో జీవించవచ్చు.. ఆనందాన్ని పొందవచ్చో.. చాణక్యుడు చెప్పాడు. అంతేకాదు మానవ జీవితంలో బంధాలు పదిలంగా ఉండాలంటే ఎ విధంగా ఉండాలి.. ఎలాంటి లక్షణాలున్న వ్యక్తులను నమ్మాలి, నమ్మరాదు అన్న విషయాలను కూడా నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ఈ రోజు ఎవరైనా పురుషుడు జీవితంలో సంతోషంగా ఉండాలంటే.. పెళ్లి చేసుకునే స్త్రీలో కొన్ని ప్రత్యెక లక్షణాలు ఉండాలని సూచించాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం 5 రకాల ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితంలో భూతల స్వర్గంగా ఉంటుందని పేర్కొన్నాడు. పెళ్లి చేసుకునే స్త్రీలో అందం, డబ్బు చూడవద్దు అని అవి తాత్కాలికం .. కనుక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే సమయంలో ఆమె ఉండే కొన్ని లక్షణాలు చూడాలని తెలిపారు. పెళ్లి చేసుకోవలనుకుంటే స్త్రీలో చూడాల్సిన ఉత్తమ గుణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
పురుషుడు ఎంచుకునే జీవిత భాగస్వామితో మనస్సులోని అన్ని విషయాలను పంచుకోవాలని కోరుకుంటాడు. పెళ్లి తర్వాత దంపతుల జీవితం మునుపటి కంటే అందంగా ఉండాలి. అయితే పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా సాగాలని ఉత్తమ జీవిత భాగస్వామి లభించాలని రూల్ ఏమీ లేదు. అదే సమయంలో కొంతమంది పురుషులు.. తాము పెళ్లి చేసుకోవాలనుకునే యువతిలో మంచి గుణాలు చూడడానికి కంటే.. అందం, డబ్బులు, బంగారం ఆస్తులను చూస్తారు. అటువంటి అమ్మాయిని జీవిత భాగస్వామిగా కావాలని కోరుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. ఈ నేపధ్యంలో చాణక్య నీతిలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న యువతిని పెళ్లి చేసుకున్న పురుషుడి జీవితం సుఖ సంతోషాలతో స్వర్గంలా ఉంటుందని వివరించాడు.
కష్టాల్లో కూడా అండగా నిలిచే గుణం
ఎవరి జీవితంలోనైనా చెడు సమయం, కష్టకాలం వస్తుంది. అటువంటి సముయంలో కూడా తన భర్తను విడకుండా అడుగడుగునా అండగా నిలబడే భార్య ఉంటే.. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడం చాలా సులభం. కనుక భర్తను అర్ధం చేసుకుని అండగా నిలిచే గుణం ఉన్న యువతిని పెళ్లి చేసుకున్న భర్త ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అలాగే స్త్రీలు కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఎల్లప్పుడూ అండగా నిలిచే పురుషులను వివాహం చేసుకోవాలని సూచించాడు.
తప్పులను ఎత్తి చూపే యువతి
చాలా మంది వ్యక్తులు తమలోని లోపాలను, తప్పులను ఎత్తి చూపిస్తే వాటిని వినడానికి ఇష్టపడరు. అయితే అలా ఎవరినా లోపాలను ఎత్తి చూపిస్తే వాటిని సరి చేసుకుని వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవాలి. తప్పులను అంగీకరించి..వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండాలి. కనుక తప్పులను ఎత్తి చూపి వాటిని సరిద్దికునేందుకు మార్గాన్ని చూపించే యువతిని జీవిత స్వామిగా పొందిన భర్త ఎప్పుడూ జీవితంలో రాణిస్తాడు.
ఎప్పుడూ గౌరవించే యువతి
ప్రతి జీవితంలో విజయాలను అందుకుంటారు. అలా విజయం అందుకున్న వ్యక్తిలో గర్వం తలెత్తకుండా జీవించాలి. తప్పులను ఎత్తి చూపిస్తూ.. విజయం సాధిస్తే గర్వపడకుండా నిరంతం భర్త వెంట ఉండే యువతిని భార్యగా దొరికిన వ్యక్తీ జీవితం స్వర్గంతో సమానం. ఏ స్త్రీ ప్రేమతో పాటు గౌరవాన్ని ఇస్తుందో.. అటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
రూపాన్ని మించిన గుణాలను ప్రేమించే స్త్రీ
ఈ ప్రపంచంలో వృద్ధాప్యం రానివారంటూ ఎవరూ ఉండరు. అటువంటి పరిస్థితిలో అందం కంటే గుణం ఉన్న స్త్రీని భార్యగా ఎంచుకొండి. అదే సమయంలో మీలో కూడా రూపం, డబ్బులనుజ్ చూసే యువతి కంటే మీలో గుణాలను నచ్చి మెచ్చిన యువతిని పెళ్లి చేసుకోండి. ఇలాంటి యువతిని వివాహం చేసుకున్న పురుషుడు జీవితం భువిలో స్వర్గమే. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ రూపం మారుతుంది. అందం పోతుంది.. కానీ గుణం ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది.
గొప్ప లక్ష్యం ఉన్న యువతి
ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉన్న యువతి ఎవరి జీవితంలోకి భార్యగా వచ్చినా ఆ పురుషుడి జీవితం స్వర్గతుల్యం అవుతుంది. ఎందుకంటే అలాంటి స్త్రీ తన భర్త చేసే పనిలో సాయం చేస్తూ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా పని చేస్తుంది. తనకు అవసరం లేని విషయాల పట్ల ఆసక్తి ఉండదు. జీవితంలో ఒక లక్ష్యం ఉన్న స్త్రీ..తన భర్త లక్ష్యం సాధించే విధంగా సాయంగా నిలుస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు