వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుని ఇలా పూజించండి.. జాతకంలో శని, బృహస్పతి దోషాల నుంచి విముక్తి..

పురాణాల శాస్త్రాల ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టుని పూజించడం చాలా ఫలప్రదం. ఈ రోజున రావి చెట్టును పూజించిన భక్తులు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున చెట్లను నాటడం వలన బృహస్పతి గ్రహం చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు.

వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుని ఇలా పూజించండి.. జాతకంలో శని, బృహస్పతి దోషాల నుంచి విముక్తి..
Vaishakh Purnima
Follow us
Surya Kala

|

Updated on: May 20, 2024 | 4:22 PM

హిందూ మతంలో వైశాఖ మాసం పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసం పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ మే 23వ తేదీ గురువారం వచ్చింది. పౌర్ణమి రోజున చేసే నదీ స్నానం, దానాలకు విశేష ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించడం ద్వారా ప్రజల కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

పురాణాల శాస్త్రాల ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టుని పూజించడం చాలా ఫలప్రదం. ఈ రోజున రావి చెట్టును పూజించిన భక్తులు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున చెట్లను నాటడం వలన బృహస్పతి గ్రహం చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు.

హిందూ మతంలో పౌర్ణమి తిధికి విశేష ప్రాముఖ్యత ఉంది. సంవత్సరంలోని పన్నెండు పౌర్ణమి తిధుల గురించి మత గ్రంధాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను వివరించారు. అయితే వైశాఖ మాసంలో శ్రీ హరితో పాటు రావి చెట్టును కూడా పూజిస్తారు. ఎందుకంటే శ్రీ హరి రావి చెట్టుపై నివసిస్తాడని విశ్వాసం. అందుకే వైశాఖ పూర్ణిమ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే

  1. వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం ద్వారా శని, బృహస్పతి, ఇతర గ్రహాలు కూడా జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయనే మత విశ్వాసం.
  2. ముక్కోటి దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది.
  3. రావి చెట్టుకు నీళ్లలో పాలు, నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెంది వారి అనుగ్రహం పొందుతారు. పూర్వీకులు కూడా ఈ చెట్టుపై ఉదయాన్నే నివసిస్తారని ప్రతీతి.
  4. సూర్యోదయం తర్వాత లక్ష్మీ దేవి నివసిస్తుంది. కనుక సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
  5. వైశాఖ పౌర్ణమి రోజున శుభ కార్యాలను చేస్తారు. తెల్లవారుజామున రావి చెట్టును పూజించిన తర్వాత రోజులో ఏ సమయంలోనైనా ఏదైనా శుభకార్యాలు చేయవచ్చు అనే నమ్మకం ఉంది.
  6. ఎవరి జాతకంలో నైనా వితంతు యోగం ఉన్నట్లయితే ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేయడం ద్వారా వైధవ్య యోగం తొలగిపోతుందని నమ్ముతారు. ఇలా చేయడం ద్వారా విష్ణువు అశుభ ప్రభావాలను తొలగించి శుభాలను కలిగిస్తాడని విశ్వాసం.
  7. వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించండి. దీని తరువాత చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల బృహస్పతి, శని శుభ ఫలితాలను ఇస్తారు. ప్రజలు జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు