Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం విషయంలో లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
దిన ఫలాలు (మే 21, 2024): మేష రాశి వారికి అన్ని వైపుల నుంచి ఆదాయాలు పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారు కుటుంబంలో ఉన్న చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి వారిని చాలా కాలంగా వేధిస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మే 21, 2024): మేష రాశి వారికి అన్ని వైపుల నుంచి ఆదాయాలు పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారు కుటుంబంలో ఉన్న చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి వారిని చాలా కాలంగా వేధిస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అన్ని వైపుల నుంచి ఆదాయాలు పెరిగే అవకాశముంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలు అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు అందు తాయి. కుటుంబ సభ్యులతో ఇంట్లో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. పుణ్య క్షేత్రాలను దర్శించు కునే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా కొందరు ఇష్ట మైన బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబంలో ఉన్న చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న సమయానికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా బాగా పురోగతి చెందుతాయి. కొందరు స్నేహితుల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండ డం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో మంచి కంపెనీల సానుకూల స్పందన లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వ్యాపారాలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఉద్యోగులు కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగే అవకాశముంది. సేవా కార్యక్రమాలు, దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు జరపడానికి ప్లాన్ చేస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్సాహంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాలను విస్తరించే ప్రయత్నాలు చేపడతారు. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. చేపట్టిన ప్రతి వ్యవహారమూ విజయవంతంగా పూర్తవుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆస్తి సమస్యలు చాలావరకు పరిష్కారమవు తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ కొంత నిరుత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
చిన్ననాటి స్నేహితులు, బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో తప్ప కుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తీరి, మానసిక ప్రశాంతత పొందుతారు. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో చిన్నా చితకా చికాకులు ఉండ వచ్చు. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభిస్తాయి. కొన్ని వ్యక్తిగత విషయాల్లో కొత్త ఆలో చనలను ఆచరణలో పెడతారు. ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ, ఆదాయం విషయంలో లోటుండదు. రావలసిన డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ముఖ్యమైన వ్యవహారాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలు సుకోవడం ఆనందం కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ముఖ్యంగా కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. ఆస్తి వివాదాల్లో బంధువులతో రాజీ చేసుకుంటారు. వ్యాపారాల్లో అంచనా లను చేరుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగు పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. కొందరు స్నేహితులను ఆదుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఇల్లు కొనుగోలుకు సంబంధించిన అవరోధాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవు తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువుల నుంచి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అంచనాలకు తగ్గట్టుగా సంపాదన పెరిగే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశముంది. రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన అవసరాలు గడిచిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృత్తి,వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసి లాభం అందుకుంటారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.