Maha Yogas: అనుకూలంగా కీలక గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి రెండు మహా యోగాలు పక్కా..!
ప్రస్తుతం గ్రహ సంచార రీత్యా నాలుగు రాశుల వారికి రెండు మహా పురుష యోగాలు ఏర్పడడం జరిగింది. మరో రెండు రాశులకు మహా భాగ్య యోగం పట్టింది. కేంద్ర స్థానాల్లో, అంటే 1,4,7,10 స్థానాల్లో శని స్వస్థానంలో గానీ, ఉచ్ఛలో గానీ సంచారం చేయడం వల్ల శశ మహా పురుష యోగం పడుతుంది. అదే విధంగా కేంద్ర స్థానాల్లో శుక్రుడు స్వస్థాన, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేయడం వల్ల మాలవ్య మహా పురుష యోగం (నెల రోజుల పాటు) పడుతుంది.
ప్రస్తుతం గ్రహ సంచార రీత్యా నాలుగు రాశుల వారికి రెండు మహా పురుష యోగాలు ఏర్పడడం జరిగింది. మరో రెండు రాశులకు మహా భాగ్య యోగం పట్టింది. కేంద్ర స్థానాల్లో, అంటే 1,4,7,10 స్థానాల్లో శని స్వస్థానంలో గానీ, ఉచ్ఛలో గానీ సంచారం చేయడం వల్ల శశ మహా పురుష యోగం పడుతుంది. అదే విధంగా కేంద్ర స్థానాల్లో శుక్రుడు స్వస్థాన, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేయడం వల్ల మాలవ్య మహా పురుష యోగం (నెల రోజుల పాటు) పడుతుంది. ప్రస్తుతం వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు ఒకే సమయంలో శశ, మాలవ్య మహా పురుష యోగాలు పట్టడం జరిగింది. ఈ యోగాల వల్ల ఈ రాశుల వారికి ఉత్తమోత్తమమైన జీవితం లభిస్తుంది. ఇక మేషం, కన్యా రాశులకు ఈ రెండు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మహా భాగ్య యోగం పట్టింది.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో స్వస్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడు, లాభ స్థానంలో స్వస్థానంలో సంచరిస్తున్న శని కలలో కూడా ఊహించని ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తులు పెంచుకోవడానికి, ఆదాయ వృద్ధికి చేసే ప్రతి ప్రయత్నమూ ఫలి స్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి రెట్టింపవుతుంది. సామాన్యుడు కూడా ఆర్థికంగా బలం పుంజుకునే సూచనలున్నాయి. నిరుద్యోగులకు కూడా అంచనాలకు మించిన ఉద్యోగం లభిస్తుంది.
- వృషభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశినాథుడు శుక్రుడి వల్ల వీరికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దశమ కేంద్రంలోని శనీశ్వరుడి వల్ల శశ మహా పురుష యోగం ఏర్పడింది. ఈ యోగాల వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. ఉన్నత స్థాయి జీవితం అలవడు తుంది. రాజకీయంగా ప్రాముఖ్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
- సింహం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడు, సప్తమ కేంద్రంలో శనీశ్వరుడి కారణంగా శశ, మాలవ్య మహా పురుష యోగాలు ఏర్పడ్డాయి. వీటివల్ల ఎక్కువగా శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ ప్రాధాన్యం లభిస్తుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరగడంతో పాటు, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం, ఆరవ స్థానంలో శని సంచారం రెండూ యోగదాయకమై నవే. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశముంది. ఆర్థిక సమస్యలన్నీ దాదాపు పరిష్కారమవు తాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం లభించడం, విదేశాల్లో స్థిరపడడం వంటివి జరుగుతాయి. వారసత్వ సంపద లభిస్తుంది. పితృభాగ్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
- వృశ్చికం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శనీశ్వరుడు, సప్తమ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల శశ, మాలవ్య మహా పురుష యోగాలు ఏర్పడ్డాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు లభిస్తాయి. పలుకుబడి పెరుగు తుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. మాతృమూలక ధన లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.
- కుంభం: ఈ రాశిలో శనీశ్వరుడు, చతుర్థ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశికి శశ, మాలవ్య మహా పురుష యోగాలు పట్టాయి. వీటివల్ల ఈ రాశివారికి అనేక విషయాల్లో అనుకూలతలు పెరుగు తాయి. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. వ్యక్తి గత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తేలికగా లాభాలు గడించడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.