AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: బలంగా రాశి అధిపతులు.. ఆరు రాశుల వారికి యోగ కాలం.. జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా.. !

ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి ఆరు రాశుల అధిపతులు బలంగా ఉన్నారు. రాశ్యధిపతుల అనుకూల సంచారం వల్ల జాతకంలో అనేక దోషాలు, సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి. ఈ రాశులకు ప్రతి విషయమూ, ప్రతి అవకాశమూ అనుకూలంగా మారుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గడంతో పాటు సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి.

Zodiac Signs: బలంగా రాశి అధిపతులు.. ఆరు రాశుల వారికి యోగ కాలం.. జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా.. !
Astrology 2024
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2024 | 2:57 PM

Share

ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి ఆరు రాశుల అధిపతులు బలంగా ఉన్నారు. రాశ్యధిపతుల అనుకూల సంచారం వల్ల జాతకంలో అనేక దోషాలు, సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి. ఈ రాశులకు ప్రతి విషయమూ, ప్రతి అవకాశమూ అనుకూలంగా మారుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గడంతో పాటు సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా బాగా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి రాశినాథుడు బాగా అనుకూలంగా ఉండడంతో ఈ రాశుల వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.

  1. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో జూన్ 12 వరకు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవన శైలి పూర్తిగా మారి పోతుంది. వృత్తి, ఉద్యోగాల విషయంలోనే కాకుండా సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. బంధుమిత్రుల్లో విలువ పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశినాథుడైన బుధుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల జూన్ 1వ తేదీ వరకు ఈ రాశివారికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయాలు సాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు అందుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవ కాశముంది. సంతాన యోగ సూచనలున్నాయి. ఉన్నత స్థాయి జీవితం ఏర్పడుతుంది.
  3. సింహం: ఈ రాశ్యధిపతి రవి జూన్ 14 వరకు దశమ స్థానంలో గురు, శుక్రులతో సంచారం చేస్తున్నందువల్ల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా ఈ రాశివారి జీవితాల్లో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అత్యధిక మొత్తాల్లో లాభార్జన ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన జూన్ 1 వరకు కుజుడు పంచమ కోణంలో ఉన్నందువల్ల అనేక శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చి సరి కొత్త గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారి సలహాలు, సూచనలు వీరు పనిచేస్తున్న కంపెనీకి లాభా లను తీసుకు వస్తాయి. పిల్లలు అంచనాలకు మించి వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవ కాశముంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.
  5. మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ఈ ఏడాదంతా ధన స్థానమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన యోగ సూచనలున్నాయి.
  6. కుంభం: ఈ రాశిలో రాశ్యధిపతి శనీశ్వరుడు ఏడాదంతా సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగపరంగా, సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందు తాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు స్థిరంగా అభివృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. పని భారం, బరువు బాధ్యతలు పెరిగినా, భవిష్యత్తులో ఇవి పురోగతికి తోడ్పడతాయి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్