Clay Pot Cooking: మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. తినే ఫుడ్ ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. అందుకు ఉపయోగించే పాత్రలు కూడా ఎలాంటివో ఒక్కసారి ఆలోచించాలి. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా.. అల్యూమినియం, ఇత్తడి, నాన్ స్టిక్ వస్తువులే ఎక్కువగా కనిపిస్తాయి. వీటిల్లో వంట చేసి తినడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ వీటిల్లో వంట ఫాస్ట్‌గా అయిపోతుందని ఎక్కువగా..

Clay Pot Cooking: మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
Clay Pot Cooking
Follow us
Chinni Enni

|

Updated on: May 20, 2024 | 4:24 PM

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. తినే ఫుడ్ ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. అందుకు ఉపయోగించే పాత్రలు కూడా ఎలాంటివో ఒక్కసారి ఆలోచించాలి. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా.. అల్యూమినియం, ఇత్తడి, నాన్ స్టిక్ వస్తువులే ఎక్కువగా కనిపిస్తాయి. వీటిల్లో వంట చేసి తినడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ వీటిల్లో వంట ఫాస్ట్‌గా అయిపోతుందని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు సడెన్‌గా యూటర్న్ తీసుకున్నారు జనాలు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి.. ఆలోచించి మట్టి పాత్రలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పూర్వం వంటకు ఎక్కువగా మట్టి పాత్రలనే ఉపయోగించేవారు. ఇప్పుడు మళ్లీ మట్టి పాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు అందరిలో ఆరోగ్యంపై కూడా అవగాహన పెరిగింది. మరి మట్టి పాత్రల్లో వండుకుని తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రుచిగా ఉంటాయి:

మట్టి పాత్రల్లో వండటం వల్ల వంటలు రుచిగా ఉంటాయన్న విషయం చాలా మందికి తెలుసు. వీటిల్లో వంట చేయడం వల్ల మట్టి వంటకు రుచిని జోడిస్తుంది. దీంతో మీరు చేసే వంటకు రుచి, సువాసన వస్తాయి.

వంటలు చెడిపోవు:

మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉంటాయి. త్వరగా పాడవ్వవు. ఆహారం చెడిపోకుండా మట్టిలో ఉండే పోషకాలు హెల్ప్ చేస్తాయి. మీరు వంటలు చేసిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

మూక్రో న్యూట్రియన్స్ ఎక్కువ:

అంతే కాకుండా మన ఆరోగ్యానికి కావాల్సిన 18 రకాల మూక్రో న్యూట్రియన్స్ ఈ మట్టిలో ఉన్నాయి. మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల 100 శాతం మైక్రో న్యూట్రియన్స్ లభిస్తాయి. కానీ ఇతర పాత్రల్లో ఏడు నుంచి 13 శాతం వరకే మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి.

గర్భిణీలు భోజనం చేస్తే మంచిది:

మట్టి పాత్రల్లో గర్భిణీలు భోజనం చేస్తే చాలా మంచిది. మట్టి పాత్రల్లో 100 శాతం మైక్రో న్యూట్రియన్స్ లభిస్తాయి. అంతే కాకుండా మట్టి పాత్రల్లో ఇన్విజబుల్ రేస్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి పుట్టే బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వాళ్లు ఆరోగ్యంగా పుట్టేలా చేస్తాయి.

డయాబెటీస్ కంట్రోల్:

మట్టి పాత్రల్లో వండిన వంటలు తింటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి షుగర్ వ్యాధితో బాధ పడేవారు మట్టి పాత్రల్లో తయారు చేసిన భోజనం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా గ్యాస్ట్రిక్ నొప్పులు, అసిడిటీ, వేడి రాకుండా చేస్తాయి. శరీరంలోని పీహెచ్ నిల్వలను సమతుల్యం చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..