తినే ఆహారంలో వీటిని ఎక్కువుగా చేర్చుకుంటున్నారా.. మీ ఆయుష్షు హారతి కర్పూరమే..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇచ్చిన ఆహార మార్గదర్శకాల ప్రకారం తినే ఆహారంలో ప్రాసెస్ చేసిన ఆహారం తక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. స్వచ్ఛమైన ఆహారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ICMR సిఫార్సు చేసింది. కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాన్ని తినడం తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టాలని సిఫార్సు చేశారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యాధి నివారణకు, శ్రేయస్సుకు ప్రధానమైనవి.'
30 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనం తర్వాత బ్రిటిష్ మెడికల్ జర్నల్ (బీఎంజే) ఓ నివేదికను ప్రచురించింది. ఆకలిని తీర్చుకోవడానికి తరచుగా స్నాక్స్‌ను ఆశ్రయించే వారికి ఇది రెడ్ అలర్ట్. ఎక్కువ వేయించిన ఆహారం స్లో పాయిజన్‌గా మారుతుందని.. ఆయుస్సుని తగ్గిస్తుంది అని నివేదిక పేర్కొంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ గుండె జబ్బులనే కాదు అనేక ఇతర వ్యాధులు కూడా మరణాలకు కారణమవున్నాయని ఈ నివేదిక సరైనదని వైద్యులు కూడా ప్రకటించారు.
వైద్యులు ఏమని చెప్పారంటే..
బీఎంజే నివేదిక ఖచ్చితంగా ఉంది. ఇందుకు సాక్ష్యంగా అనేక విషయాలు ఉన్నాయని.. ఢిల్లీలోని నారాయణ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. స్నాక్స్ కు ఎవరైనా బానిసగా మారి, ఎక్కువ స్నాక్స్ తీసుకుంటే అది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. రోజూ ఎంత అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ తినవచ్చు తద్వారా ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుంది అనే విషయాలపై ఖచ్చితమైన సమాధానం చెప్పలేమని పేర్కొన్నారు. అయితే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇచ్చిన ఆహార మార్గదర్శకాల ప్రకారం తినే ఆహారంలో ప్రాసెస్ చేసిన ఆహారం తక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. స్వచ్ఛమైన ఆహారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ICMR సిఫార్సు చేసింది. కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాన్ని తినడం తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టాలని సిఫార్సు చేశారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యాధి నివారణకు, శ్రేయస్సుకు ప్రధానమైనవి.’
ఎవరైనా తమ జీవితాన్ని ప్రేమిస్తున్నట్లయితే.. ప్యాకేడ్ ఫుడ్ కు, సాసేజ్‌లు, నగ్గెట్స్, స్వీట్లు, బిస్కెట్లు, పేస్ట్రీలు, బన్స్, కేకులు, చిప్స్ మొదలైన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఢిల్లీలోని సాకేత్‌లోని మాక్స్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ రితికా సమదర్ మాట్లాడుతూ.. ‘ఈ ఆహార పదార్థాల్లో చక్కెర, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. కనుక ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించి.. ఆరోగ్యాన్ని ఇచ్చే తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయలు వంటి తృణధాన్యాలు ఎక్కువగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్‌లో, మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్ ఆధారిత రెడీ-టు-ఈట్ ఉత్పత్తులు ప్రత్యేక ఆందోళన కలిగిస్తున్నాయని వైద్యులు చెప్పారు.
ప్యాక్ చేసిన ఫుడ్‌పై వ్రాసినవన్నీ నిజమని విశ్వసిస్తే..
కనీసం ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుని హానికరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే నష్టం గురించి వివరంగా చర్చించారు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల సంబంధిత మరణాల ప్రమాదం 50% పెరుగుతుందని బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా ఆందోళన-ఒత్తిడి, సాధారణ మానసిక రుగ్మతల ప్రమాదం 48-53% పెరుగుతుంది. అదే సమయంలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం 12% పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. సర్ గంగా రామ్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్, వైస్ చైర్మన్ డాక్టర్ పీయూష్ రంజన్ మాట్లాడుతూ.. ‘నిత్యజీవితంలో వీటన్నింటికి దూరంగా ఉండటం చాలా కష్టం.. అయితే వీలైనంత వరకు తగ్గించుకోవాలి’ అని అన్నారు. మొత్తం మీద సమతుల్య ఆహారం ముఖ్యమని చెప్పారు. పారాస్ హెల్త్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ హెడ్ నీలిమా బిష్త్ మాట్లాడుతూ.. అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కనుక అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ ఐటెమ్‌లకు కూడా దూరంగా ఉండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..