Anantapur: అనంతపురంలో చిరుత సంచారం.. పొలంలో హల్‌చల్.. భయంతో పరుగులు తీసిన రైతులు
అనంతరపురంలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లాలో ఎలుగుబంట్లు, చిరుతపులులు తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి.
Anantapur: ఆంధ్రప్రదేశ్ లో అడవులను వదిలి.. జనావాసాల బాట పడుతున్నాయి కౄర జంతువులు. వివిధ ప్రాంతాల్లో పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు కనిపిస్తూ.. మనుషులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో ఓ బెంగాల్ టైగర్, మరోవైపు ఎలుగు బంటి హల్ చల్ చేస్తుండగా.. ఇప్పుడు ఉమ్మడి అనంతరపురంలో పులులు కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లాలో ఎలుగుబంట్లు, చిరుతపులులు తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి. నిన్నటి వరకు ఎలుగు బంట్ల సంచారంతో కళ్యాణదుర్గం మండలం వాసులు భయాందోళనలకు గురయ్యారు.
తాజాగా రెండు మూడు ప్రాంతాల్లో చిరుతల సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. కూడేరు మండలం మరుట్ల-2 కాలనీ సమీపంలోని అడవిలో చిరుత కలకలం సృష్టించింది. ఇక్కడ అటవీ ప్రాంతంలో మూడు రోజులుగా చిరుత సంచారిస్తోంది. అయితే ఆదివారం ఏకంగా చిరుత పొలాల్లోకి వచ్చింది. దీంతో పొలంలోని రైతులు.. భయంతో గ్రామంలోని పరుగులు తీశారు.
అంతేకాదు కుందుర్పి మండలంలోని తెనగల్లు, ఎనుములదొడ్డి పరిసర ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కరిగానిపల్లి సమీపంలో ఒక లేగదూడ, రెండు మేకలను చిరుతలు చంపి తిన్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు గ్రామస్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారే చేశారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..