AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: నేడు సెప్టెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్.. ముందు వ‌చ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న‌ కేటాయింపు

ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన టిక్కెట్లు లక్కీ డిప్‌లో కేటాయించనున్నారు. ఆర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు ఈరోజు ఉదయం 10 నుండి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ సూచించింది.

Tirumala: నేడు సెప్టెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్.. ముందు వ‌చ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న‌ కేటాయింపు
TTD
Surya Kala
| Edited By: |

Updated on: Jun 27, 2022 | 12:14 PM

Share

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ (TTD). సెప్టెంబరు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(arjita Seva tickets) కోటాను ఆన్‌లైన్ లో ఈరోజు టీటీడీ విడుదల చేయనుంది. మొత్తం 46,470 టిక్కెట్‌లలో, లక్కీ డిప్ సేవా టిక్కెట్లు 8070 భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ముందు వ‌చ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న‌ 38,400 టికెట్లు ఉన్నాయని తెలిపింది టీటీడీ.

ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన టిక్కెట్లు లక్కీ డిప్‌లో కేటాయించనున్నారు. ఆర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు ఈరోజు ఉదయం 10 నుండి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ సూచించింది.

ఆన్‌లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టిక్కెట్‌ల నిర్ధారణ చేయబడుతుంది. కేటాయించిన టిక్కెట్ల జాబితా జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్,  ఇ-మెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని ఆర్జిత ఈ సేవా టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరుతున్నది.

ఇవి కూడా చదవండి

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం,  సహస్ర దీపాలంకార సేవలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన భక్తులు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయించబడుతుంది. భక్తులు తమ సేవా టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ మార్గదర్శకాలను గమనించాల్సిందిగా టిటిడి కోరుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?