Lord Shiva: శివయ్య అనుగ్రహం పొందడానికి కొన్ని నియమాలున్నాయి. సోమవారం ఏ విధంగా పూజించాలంటే..

శివుని ఆరాధనకు కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. ఇలా ఆరాధన చేయడం వలన అకాల మరణం, శత్రువు భయం వంటి వాటిని నివారిస్తుంది.

Lord Shiva: శివయ్య అనుగ్రహం పొందడానికి కొన్ని నియమాలున్నాయి. సోమవారం ఏ విధంగా పూజించాలంటే..
Lord Shiva Worship
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2022 | 9:11 AM

Lord Shiva Worship Rules: హిందూ మతంలో.. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈరోజున శివయ్యను పూజించడం వలన అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతాడని, కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సనాతన హిందూ సంప్రదాయంలో.. శివుడిని భోళాశంకరుడు అని పిలుస్తారు. కేవలం జలంతో అభిషేకించినా సంతోషించి.. కోరుకున్న వరాన్ని ఇస్తాడని నమ్మకం. శివుని ఆరాధనకు కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. ఇలా ఆరాధన చేయడం వలన అకాల మరణం, శత్రువు భయం వంటి వాటిని నివారిస్తుంది.. అయితే శివయ్య పూజ విధానంలో నియమాలను పక్కన పెట్టి పూజిస్తే.. పుణ్యానికి బదులుగా.. పాపంతో శిక్షించబడతాడు లేదా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు శివుని ఆరాధనలో ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం.

శివారాధనలో ముఖ్యమైన నియమాలు: 

  1. చేపట్టిన పనుల్లో సత్వర విజయం పొందాలంటే.. మహాదేవుడిని సరైన దిశలో ఆరాధించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది.
  2. గంగాజలం లేకుండా శివుని ఆరాధన లేదా అభిషేకం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఫలవంతమైన ఫలితాలను పొందడానికి  శివునికి పాలు, గంగాజలం సమర్పించాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఏర్పడిందని శివునికి చాలా ప్రీతికరమైనదని నమ్మకం. శివారాధన సమయంలో ఎల్లప్పుడూ రుద్రాక్ష జపమాలతో శివయ్య మంత్రాలలో ఏదైనా జపించండి.
  5. మొగలి పువ్వు, మల్లెపువ్వు, నాగమల్లి, సంపంగి వంటి పువ్వులతో ఎప్పుడూ శివయ్యను పూజించవద్దు. శివుని ఆరాధనలో.. బిల్వపత్రాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. బిల్వ పత్రం సమర్పిస్తే..  త్వరగా ప్రసన్నం అవుతాడని నమ్మకం.
  6. శివాలయంలోకి వెళ్లిన వెంటనే నేరుగా గ‌ర్భగుడి చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేయ‌కూడ‌దు.  ముందుగా నందీశ్వరుని వ‌ద్ద ప్రద‌క్షిణ ప్రారంభించి ఈశ్వరుని వ‌ద్దకు వెళ్లి ఆయ‌న్ను ద‌ర్శించుకుని మ‌ళ్లీ వెన‌క్కి రావాలి. మళ్ళీ నందీశ్వరుని వ‌ద్ద ఆగి అటు నుంచి గర్భగుడి మీదుగా లింగాన్ని అభిషేకించే జ‌లం వ‌ద్దకు రావాలి. అక్కడి నుండి వెన‌క్కి తిరిగి నందీశ్వరుని వ‌ద్దకు వ‌చ్చి ప్రద‌క్షిణ పూర్తి చేయాలి.
  7. శివుని అనుగ్రహం పొందడానికి, సోమవారం నాడు ఉపవాసం ఉండి… ఈ రోజున ఉప్పుని ఆహారాన్ని ప్రసాదంగా  తీసుకోవాలి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)