AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: సరస్వతి దేవిగా దుర్గమ్మ దర్శనం.. సాయంత్రం పట్టుబట్టలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు

అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గాదేవి కొలువైన ఇంద్రకీలాద్రి పై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు మూలా నక్షత్రం కనుక ఈ నవరాత్రి ఎనిమిదవ రోజున సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది కనకదుర్గమ్మ. స్వరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Indrakeeladri: సరస్వతి దేవిగా దుర్గమ్మ దర్శనం.. సాయంత్రం పట్టుబట్టలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు
Indrakeeladri
Surya Kala
|

Updated on: Sep 29, 2025 | 9:19 AM

Share

దేవి శరన్నవరాత్రులను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గాదేవి కొలువైన ఇంద్రకీలాద్రి పై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు మూలా నక్షత్రం కనుక ఈ నవరాత్రి ఎనిమిదవ రోజున సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది కనకదుర్గమ్మ. శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్శనం కోసం క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు.

చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ

నేడు మూల నక్షత్రం సందర్భంగా స్వరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇంద్రకీలాద్రి కి సీఎం చంద్రబాబు రానున్నారు.

ఇవి కూడా చదవండి

మూల నక్షత్రంలో శ్రీ సరస్వతీ దేవిగా ఇంద్రకీలాద్రి పై కొలువైన కనక దుర్గమ్మ

సరస్వతి వేదకాలం నుంచి అర్చామూర్తిగా ఋషీశ్వరులచే స్తుతించబడుతోంది. సృష్టికి ఆధారమైన ప్రణవనాదం ఓం కారం నుంచే సర్వవిద్యలు ఉత్పన్నమయ్యాయని.. ప్రణవ నాదం సరస్వతీరూపం… అందుకే సకల విద్యలకు ఆధారంగా చదువుల తల్లిగా సరస్వతీ పూజింపబడుతోంది. సృష్టికారకుడైన బ్రహ్మ సంకల్పశక్తి సరస్వతి. వాణి, శారద, వంటి నామాలతో పూజింపబడుతోంది. సరస్వతీ వాహనం హంస. పాలను, నీళ్ళను వేరు చేయగల శక్తి ఒక్క హంసకే ఉందని చెబుతారు. అంటే ప్రపంచంలో సదసత్తులను విడదీసి, సద్వస్తువైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అర్థం. వీణను ధరించిన ఆమె నాదరూపిణి. ఆమె దేహం రంగు తెల్లని తెలుపు. పరిపూర్ణ పరిశుద్ధ తత్వానికి, ప్రశాంతతకు గుర్తు. తెలుపు సప్త వర్ణాల కలయిక.

వేదాలకు ఆదిమూలమైన సరస్వతి విద్యా, వివేకాల దివ్యతత్వం. సరస్.. శబ్దానికి, ప్రవాహం, చలనం అని అర్థం. అందుకే సరస్వతి సృష్టి కర్త బ్రహ్మ చైతన్యశక్తిగా అన్వయింపబడుతోంది. జీవరాశులలో మాట్లాడే శక్తి గల వారి నాలుకపై వసించు దేవి సరస్వతి. సరస్వతీ సూక్తంలో ఆమె మహాసరస్వతిగా నుతింపబడింది. పరిజ్ఞానాన్ని, విముక్తి ప్రసాదించు తల్లి సరస్వతి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు