- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips for henna plant, is it good or bad for your home according to vastu shastra
Henna Plant Vastu Tips: ఇంట్లో గోరింటాకు మొక్క పెంచుకోవాలా..! వద్దా..! వాస్తు శాస్త్రం ఏమి చెబుతోందంటే..
ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణ లో లేదా ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకోవడాన్ని ఇష్టపడతారు. అయితే కొన్నింటిని శుభప్రదంగా భావిస్తారు. మరికొన్నింటిని అశుభకరంగా భావిస్తారు. కనుక ఇంటికి అలంకరణ కోసమో లేదా ఇతర ప్రయోజనాల కోసం వివిధ మొక్కలను ఇంట్లో పెంచుకోవాలంటే వాస్తు శాస్త్రం కొన్ని నియమాలను పేర్కొంది. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను పెంచకూడదు ఎందుకంటే అవి మీ ఇంటికి దురదృష్టం, అశుభాన్ని తెస్తాయి. ఈ నేపధ్యంలో వాస్తు ప్రకారం ఇంట్లో గోరింట మొక్కను నాటాలా వద్దా అని తెలుసుకుందాం.
Updated on: Sep 25, 2025 | 4:06 PM

కొంతమంది మొక్కలను పెంచుకోవడం అంటే ఇష్టం. దీంతో ఇంటిని ఆకర్షణీయంగా, అందంగా కనిపించేలా చేయడానికి రకాల చెట్లు, మొక్కలను పెంచుకుంటారు. ఇంట్లో మొక్కలను పెంచడం వలన పర్యావరణం స్వచ్ఛంగా, సానుకూలంగా ఉంటుంది. అయితే ఇంట్లో పెంచుకునే చెట్లు, మొక్కల విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలి. మొక్కల పెంచే విషయంలో తెలిసి లేదా తెలియకుండా వాస్తుని నిర్లక్షం చేస్తే అనేక సమస్యలకు దారితీస్తుంది. అటువంటి మొక్కలో గోరింటాకు మొక్క ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవాలా వద్దా అనేది తెలుసుకుందాం..

గోరింటాకుని ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మహిళలు తరచుగా ఆషాడ మాసం, అట్ల తద్ది వంటి పండగలలో మాత్రమే కాదు ఏ చిన్న సందర్భం వచ్చినా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. గోరింటాకు అనేది మహిళల అలంకారంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే గోరింటాకును ఎంత శుభప్రదంగా భావిస్తారో.. గోరింటాకు మొక్కను ఇంటిలో పెంచుకోవడం అంత అశుభకరం అని మీకు తెలుసా..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింట చెట్టును పెంచుకోవడం చాలా అశుభకరం. దీని సువాసన అందరినీ ఆకర్షిస్తుంది. గోరింట మొక్కలో, దానిని ఎక్కడ నాటినా అక్కడ ప్రతికూల శక్తులు నివసిస్తాయని నమ్ముతారు. కనుక గోరింటాకు మొక్క ఇంటి ఆవరణలో ఉంటే.. అప్పుడు ఇంటి ఆనందం, శాంతిపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. కనుక గోరింట మొక్కను ఇంట్లో ఎప్పుడూ నాటకూడదు.

ఇంట్లో గోరింట చెట్టు నాటడం వల్ల.. ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లోని ప్రతి సభ్యుడు ఒక్కొక్కరుగా తరచుగా అనారోగ్యానికి గురవుతారు. కనుక ఇంట్లో గోరింట చెట్టును ఎప్పుడూ నాటకూడదు.

పొరపాటున ఇంట్లో గోరింటాకు మొక్కను పెంచుకుంటే.. దీని కారణంగా ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎల్లప్పుడూ విభేదాలు తలెత్తుతాయి. ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల మానసిక ప్రశాంతతపై కూడా ప్రభావం చూపుతుంది. ఎప్పుడూ మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

గోరింట చెట్టు నాటడం వల్ల ఆ ఇంటి సభ్యులు ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. అంతేకాదు జీవితంలో పురోగతి కూడా ఆగిపోతుంది.

గోరింటాకు చెట్టు ఉంటే ఆ ఇంట్లో నివసించే వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. కనుక ఇంట్లో గోరింట చెట్టు ఉంటే.. దానిని ఈరోజే తొలగించండి. అయితే ఇంటి ఆవరణ కి దూరంగా అంటే ఇంటి గోడ బయట మాత్రం గోరింటాకు మొక్కను పెంచుకోవచ్చు.




