AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2025 Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!

విఘ్నాలను తొలగించే దేవుడు శ్రీ గణనాథుడి పూజతో వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూలు, పండ్లు, మోదకాలు సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున మీ బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి. మీకోసమే ఈ ట్రెండింగ్ విషెస్.

Ganesh Chaturthi 2025 Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!
Vinayaka Chavithi Wishes
Prashanthi V
|

Updated on: Aug 26, 2025 | 10:54 PM

Share

విఘ్నాలను తొలగించే దేవతల్లో మొదటివాడు శ్రీ గణనాథుడు. అందుకే ఏ శుభకార్యం మొదలు పెట్టినా ముందుగా ఆయనను పూజిస్తారు. మనం చేసే పనులకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని గణపతిని ప్రార్థిస్తారు. ప్రతి ఇంట్లో గణేశుని విగ్రహాన్ని పెట్టి, పూలు, పండ్లు, మోదకాలు సమర్పించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి. మీకోసం ట్రెండింగ్ విషెస్ నేను తీసుకొచ్చాను. 

వినాయక చవితి శుభాకాంక్షలు

  • మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం సాధించాలని.. ఆ గణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • ఎలుక వాహనుడు, లడ్డూలు ఇష్టపడేవాడు, అడ్డంకులను తొలగించే మహాగణపతి.. నీ ఆశీస్సులు అందరికీ లభించాలి అని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • విఘ్నహర్త గణేశుడు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ రక్షించి.. మీరు చేసే పనులన్నీ సులభంగా పూర్తి అయ్యేలా చూడాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • ఏనుగు ముఖం ఉన్నవాడా.. భూతగణాలకు నాయకుడా.. పార్వతి పుత్రుడా.. నీ దయతో భక్తుల కష్టాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • గణపతి దయతో మీ ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, అదృష్టం నిండాలని కోరుకుంటూ మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.
  • విజయ గణపతి అనుగ్రహంతో మీకు ఎప్పుడూ విజయాలు, లాభాలు, మంచి జరగాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • పెద్ద బొజ్జ ఉన్న గణపతి మీ కష్టాలను తొలగించి.. జీవితంలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నీ విని.. మీరు కోరుకున్న కోరికలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తి కావాలని.. మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు రాకూడదని గణేశుడిని ప్రార్థిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • అడ్డంకులను తొలగించే గణేశుడు మీ జీవితాన్ని ఆనందం, సంపద, ఆరోగ్యం, జ్ఞానంతో నింపాలని కోరుకుంటూ మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.
  • ఈ పండుగ రోజు గణపతి ఆశీస్సులతో మీ జీవితం తీయగా ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • అన్ని అడ్డంకులను తొలగించే వినాయకుడు మీ ప్రార్థనలకు స్పందించి.. మీరు అనుకున్న విజయాలను ఇవ్వాలని మనసారా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • జ్ఞానం, విజయాలు, ఆరోగ్యం, దీర్ఘాయువు ఇచ్చే వినాయకుడి దయ ఎప్పుడూ మీ జీవితంలో ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి సందర్భంగా ఈ ప్రత్యేక శుభాకాంక్షలతో మీ ఆత్మీయులతో పండుగ ఆనందాన్ని పంచుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.