AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే ఎత్తయిన గణేశ విగ్రహం.. ఇదే వీడియో

ప్రపంచంలోనే ఎత్తయిన గణేశ విగ్రహం.. ఇదే వీడియో

Samatha J
|

Updated on: Aug 27, 2025 | 7:30 AM

Share

గణేష్‌ చతుర్ది అంటే భారతీయులకు ఎంతో ఇష్టమైన పండుగ. వినాయక చవితి వస్తుందంటే చిన్నా పెద్దా.. అంతా కలిసి వాడవాడలా మండపాలలో వినాయక విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేస్తారు. వినాయక చవితికి పెట్టే గణేశ విగ్రహాలలో ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసే విగ్రహం దేశంలోనే ఎత్తయిన విగ్రహాలలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అటు.. ఏపీలోనూ పలు ప్రదేశాలలో ఇలాంటి ఎత్తయిన గణేష్‌ విగ్రహాలను ప్రతిష్టించటం తెలిసిందే.

మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేష్‌ విగ్రహం ఎక్కడుందో మీకు తెలుసా? అది భారతదేశంలో మాత్రం కాదు.. అదెక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అతిపెద్ద గణేష విగ్రహం థాయ్‌లాండ్‌లో ఉంది. దీనిని కంచుతో నిర్మించారు. ఇక్కడ గణపతి నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తాడు. సుమారు 14 అంతస్తుల భవనమంత ఎత్తుగల ఈ విగ్రహం.. థాయిలాండ్‌లోని చాచోయెంగ్‌సావ్ ప్రావిన్స్‌లో ఉన్న ఖ్లాంగ్ ఖుయాన్ గణేశ ఇంటర్నేషనల్ పార్క్‌లో ఉంది. 854 వేర్వేరు భాగాలను జోడించి.. సుమారు 128 అడుగుల ఎత్తుగల ఈ విగ్రహాన్ని రూపొందించారు. 2008లో మొదలైన దీని నిర్మాణం 2012 వరకు సాగింది. నాటి నుంచి ఇది భక్తులకు, పర్యాటకులకు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. థాయిలాండ్‌లో గణేశుడిని ‘ఫ్రా ఫికానెట్’ పేరుతో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆటంకాలను తొలగించి, విజయాన్ని అందించే దేవుడిగా అక్కడి బౌద్ధులు కూడా గణపతిని విశేషంగా ఆరాధిస్తారు. ఈ కారణంగానే ఈ ప్రదేశం హిందువులతో పాటు బౌద్ధులకూ ముఖ్య పుణ్యక్షేత్రంగా మారింది. ఈ విగ్రహంలోని గణనాథుడు నాలుగు చేతుల్లో పనస, చెరకు, అరటి, మామిడి పండ్లను ధరించి ఉంటారు. ఇవి వరుసగా సమృద్ధి, ఆనందం, పోషణ, జ్ఞానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. చాచోయెంగ్‌సావ్‌ను ‘గణేశ నగరం’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ నిలుచున్న విగ్రహంతో పాటు, మరో రెండు భారీ గణపతి విగ్రహాలు కూర్చున్న, శయన భంగిమల్లో కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తూ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో