తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను చూస్తూ ఉంటాం. అయితే కొన్ని వీడియోలను చూసి జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఇలాంటి వస్తువు అమ్ముడుపోవడం మీరు ఖచ్చితంగా ఎప్పుడూ చూసి ఉండరు. అందుకే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మార్కెట్లో కీరా దోసకు చాలా డిమాండ్ ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా కీరా దోస ప్రజాదారణ పొందుతుంది. ఎందుకంటే శరీరానికి నీటిని అందిస్తుంది కనుక దీన్ని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అందుకే కీరా దోసలో లేదా కీరా దోస మొక్కలను ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. కానీ మీరు మార్కెట్లో కీరా దోసకాయ తొక్కలు అమ్మడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కీరా దోసకాయ తొక్కలను అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. ఒక దుకాణదారుడు పెద్ద బండి మీద కీరా దోస తొక్కలను అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అవి చాలా తాజాగా కనిపిస్తున్నాయి. వీడియో తీస్తున్న వ్యక్తి తాతా ఈ కీరా దోస తొక్కలు కిలోకి ఎంత అని అడిగగా దానికి తాత కిలో 10 రూపాయలు అని చెప్పాడు. సరే ఇవ్వమని అడగగా వెంటనే తాత కూడా ఒక ప్యాకెట్ తీసుకొని దానిలో కొన్ని తొక్కలు ఆపే మసాలా వేసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. కీరా దోస తొక్క కొన్నిసార్లు చేదుగా అనిపించవచ్చు. కానీ ఈ తొక్క పోషకాలతో నిండి ఉంటుంది. కీరా దోస తొక్కల్లో ఫైబర్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు, సిలికా పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ తమ భావాలను తెలియజేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బాబా వంగా జ్యోతిష్యం.. 2026లో మూడో ప్రపంచ యుద్ధం వీడియో
19 ఏళ్లకు వరించిన అదృష్టం.. వేల మందికి విందు వీడియో
సినిమాలపై సమంత కీలక నిర్ణయం.. ఇకపై..వీడియో
ఈ పురుగు దొరికితే పంట పండినట్లే.. వీడియో
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
