సినిమాలపై సమంత కీలక నిర్ణయం.. ఇకపై..వీడియో
స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ విషయంలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయకుండా, తన ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల ‘గ్రాజియా ఇండియా’ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మేగజైన్ తాజా ఎడిషన్ కవర్ పేజీపై కూడా సమంత మెరిశారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఇకపై ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయనని, తన శరీరం చెప్పే మాట వినాలని తెలుసుకున్నానని, అందుకే పనిభారాన్ని తగ్గించుకుంటున్నానని తెలిపారు. తనశారీరక, మానసిక ఆరోగ్యానికే నా మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అయితే, ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా వాటి నాణ్యత విషయంలో మాత్రం కచ్చితంగా పెరుగుదల ఉంటుందని స్పష్టం చేశారు. తక్కువ సినిమాలు చేసినా, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలతోనే వస్తానని వివరించారు.ఎన్ని సినిమాలు చేశామనేది కాదని.. ఎంత మంచి చిత్రాలు తీశామనేది ముఖ్యమన్నారు. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న సామ్.. ప్రస్తుతం సినిమాలతో పాటు ఆరోగ్యంపైనా దృష్టిసారించినట్టుతెలిపారు. గతంలో కన్నా ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చిందని, గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నానని వివరించారు. ఫిట్‌నెస్, సినిమాలు రెండిటిపైనా దృష్టిపెట్టడమే కాకుండా, మంచి సినిమాలు, సిరీస్‌లలో భాగమయ్యానని తెలిపారు
మరిన్ని వీడియోల కోసం :
విజయవాడలో మహా మట్టి గణపతి.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో
తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్
నన్ను వదిలేసి వెళ్లిపోతున్నావా నేస్తమా? వీడియో
ఇది కదా తల్లి ప్రేమంటే.. వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

