నన్ను వదిలేసి వెళ్లిపోతున్నావా నేస్తమా? వీడియో
సాధారణంగా ఎవరైనా మరణిస్తే బంధుమిత్రులు ఆఖరి చూపు కోసం వస్తారు. అంత్యక్రియలు అయ్యే వరకు కూడా ఉంటారు. ఇంట్లోని పెంపుడు జంతువులు సైతం చనిపోయిన యజమానిని చూసి.. తమ చేష్టలతో ప్రేమను విశ్వాసాన్ని ప్రకటిస్తుంటాయి. అయితే.. వీధుల్లో తిరిగే ఓ ఆంబోతు రోజూ తాను చూసే, తనను ప్రేమగా తడిమే.. మనిషి చనిపోవటంతో కన్నీరు కారుస్తూ.. ఆ ఇంటిముందే కూర్చుండిపోయింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన.. జంతువుల ప్రేమ విశ్వాసాలకు సాక్ష్యంగా నిలిచింది.
రుణానుబంధానికి మనుషులు, జంతువులనే తేడా ఉండదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మీగడం పాడుతండాకు చెందిన గిరిజన రైతు రూపావత్ చిన్నా నాయక్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చిన్నా నాయక్ ను మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నా నాయక్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఇంటికి తీసుకువచ్చారు. బంధుమిత్రుల ఆఖరి చూపుకోసం ఉంచారు. ఇంతలో అక్కడికి ఆ గ్రామంలో సంచరించే ఆంబోతు వచ్చింది. ఫ్రీజర్ లో ఉంచిన చిన్నానాయక్ మృతదేహాన్ని చూసి.. అక్కడే ఆగిపోయింది. మిత్రమా నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోతున్నావా… అన్నట్టుగా నాయక్ తల వద్ద పడుకొని, మూగగా రోధించింది.దీంతో అక్కడున్న వారందరూ ఆ మూగజీవి ప్రేమకు ఆశ్చర్యపోయారు. ఆఖరి చూపు కోసం వచ్చిన బంధువులు… అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసి.. నాయక్ మృతదేహాన్ని కదలించేందుకు ప్రయత్నించినా.. ఆ ఆంబోతు అక్కడి నుంచి లేవకుండా కన్నీరు కారుస్తూనే ఉండిపోయింది. గిరిజన తండాలలో పశువులను కూడా దైవంగా భావిస్తారు. కొన్నేళ్ళ క్రితం గ్రామస్తులు ఓ కోడెదూడను ఆంబోతుగా వదిలారు. నాటి నుంచి అది గ్రామంలో తిరుగుతూ అప్పుడప్పుడు ఇంటి ముందుకు వచ్చేదని, దానికి చిన్నా నాయక్ దాణా పెడుతుండే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఆంబోతు పెంపుడు జంతువు కానప్పటికీ.. ఇలా ఆత్మీయత ప్రదర్శించడం ఆశ్చర్యానికి గురిచేసిందనీ గ్రామస్తులు చెబుతున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న నేటి రోజుల్లో మూగజీవాల విశ్వాసం, ఆత్మీయత సాటిలేనిది అన్నారు.
మరిన్ని వీడియోల కోసం:
ఆసుపత్రిలోకి వచ్చిన ఎద్దు .. ఏం చేసిందంటే వీడియో
పెరట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా…హడల్ వీడియో
కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం వీడియో
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
