ఈ పురుగు దొరికితే పంట పండినట్లే.. వీడియో
ఓ పురుగు విలువ రూ.75 లక్షలంటే నమ్మగలరా? అయితే మీరు ‘స్టాగ్ బీటిల్’ అనే కీటకం గురించి తెలుసుకోవాల్సిందే. ఇది అత్యంత అరుదైనదే కాదు, చాలా మంది దీన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీనివల్ల ఊహించని సంపద వస్తుందని విశ్వసిస్తారు. అందుకే దీనికి అంత ధర చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే జాతికి చెందినది. అటవీ పర్యావరణంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.
లండన్‌కు చెందిన ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ ప్రకారం.. ఈ పురుగు బరువు 2-6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపు 3-7 సంవత్సరాలు జీవిస్తుంది. మగపురుగులు 35-70 మిల్లీమీటర్లు, ఆడపురుగులు 30-50 మి.మీ. పొడవు ఉంటాయి. ఈ కీటకాలను చికిత్సల్లోనూ వాడతారు. ఈ పురుగులకు ఉన్న కొండీలు.. మగ జింకల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి ‘స్టాగ్ బీటిల్స్’ అనే పేరొచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి.ఇటీవల ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో స్టాగ్ బీటిల్ కనిపించింది. ఇవి అరుదుగా ఉంటాయని, వీటి బలమైన కొమ్ముల్లాంటి భాగాలతో శత్రువులపై పోరాడుతాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. స్థానికంగా జింక కొమ్ముల పురుగు అంటారని పేర్కొన్నారు. ఇవి కుళ్లిపోతున్న కలపను విచ్ఛిన్నం చేసి పర్యావరణానికి మేలు చేస్తాయి. మగ పురుగులకు శక్తిమంతమైన దవడలు ఉంటాయి. జపాన్‌లో వీటికి మంచి ధర ఉంది. చైనాలో వీటిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు అని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం :
విజయవాడలో మహా మట్టి గణపతి.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో
తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్
నన్ను వదిలేసి వెళ్లిపోతున్నావా నేస్తమా? వీడియో
ఇది కదా తల్లి ప్రేమంటే.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
