AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కన మూత్ర విసర్జన క్షణాల్లో కుప్పకూలిన యువకుడు

ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కన మూత్ర విసర్జన క్షణాల్లో కుప్పకూలిన యువకుడు

Phani CH
|

Updated on: Aug 24, 2025 | 5:20 PM

Share

అసలే ఇది వర్షాకాలం.. కాసిన్ని ఇలా నీళ్లు తాగితే చాలు..అలా మూత్రం వచ్చేస్తుంది. అయితే ఎక్కడ పడితే అక్కడ మూత్ర విస‌ర్జన చేశారో బీకేర్‌ఫుల్..! అజాగ్రత్త ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మూత్ర విసర్జన చేస్తూ ఏకంగా మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వ‌ర్షా కాలంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వ‌ద్ద మూత్ర విస‌ర్జన చేస్తే, ప్రాణాల మీదికి కొని తెచ్చుకున్న‌ట్టే..!

అసలే ఇది వర్షాకాలం.. కాసిన్ని ఇలా నీళ్లు తాగితే చాలు..అలా మూత్రం వచ్చేస్తుంది. అయితే ఎక్కడ పడితే అక్కడ మూత్ర విస‌ర్జన చేశారో బీకేర్‌ఫుల్..! అజాగ్రత్త ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మూత్ర విసర్జన చేస్తూ ఏకంగా మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వ‌ర్షా కాలంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వ‌ద్ద మూత్ర విస‌ర్జన చేస్తే, ప్రాణాల మీదికి కొని తెచ్చుకున్న‌ట్టే..! అవును.. ట్రాన్స్‌ఫార్మ్‌ వద్ద ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తుండగా.. విద్యుత్ షాక్ త‌గిలి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భ‌వ‌న్ సమీపంలో ఉన్న ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వర్షం పడటంతో ఆ ప్రాంతమంతా తడిగా మారిపోయింది. అయితే ఆ ట్రాన్స్‌ఫార్మర్ వ‌ద్ద ఓ యువకుడు మూత్ర విస‌ర్జన చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా అతనికి విద్యుత్ షాక్ త‌గిలి అక్కడిక‌క్కడే కుప్పకూలిపోయాడు. అప్రమ‌త్తమైన స్థానికులు.. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అతన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని పట్టణానికి చెందిన దంతాల చక్రాధర్ గా గుర్తించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల వరుస విద్యుత్ షాక్ మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక విషాద ఘటనను మరువక ముందే మరో ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌ రామంతపూర్‌లో జరిగిన ఘటనలో ఐదుగురు, బండ్లగూడలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు, బాగ్‌అంబర్‌పేటలో ఒకరు, సిద్దిపేట జిల్లాలో మరో ఇద్దరు, కామారెడ్డి జిల్లాలో ఒకరు.. ఇలా మూడు రోజుల వ్యవధిలోనే 11మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్.. 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా ఈజీగా పట్టుకున్న యువకుడు

టీచర్‌ నో చెప్పిందని కక్ష పెంచుకున్న విద్యార్థి.. ఏం చేశాడంటే..

పార్లర్‌కు వెళ్తున్నారా? ఈ ప్రమాదంతో జాగ్రత్త

Airtel: కస్ట్‌మర్లకు ఎయిర్‌టెల్‌ బిగ్‌ షాక్‌..

ఎంత పని చేసింది కాకి.. చివరికి ఏమైందంటే