ఎంత పని చేసింది కాకి.. చివరికి ఏమైందంటే
బంగారం దొంగతనాలు సాధారణంగా మనుషులే చేస్తారు. కానీ ఈ ఘటనలో మాత్రం కాకి చేసింది. బంగారం అంటే ఏదో గ్రాము, రెండు గ్రాములు కాదు.. ఏకంగా మూడున్నర తులాలు. అదేంటీ కాకి బంగారం దొంగతనం ఎలా చేసిందని మీరు అవాక్కవుతున్నారా. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. కొన్ని కొన్ని దొంగతనాల గురించి విన్నపుడు.. బాధ కంటే ఆశ్చర్యమే కలుగుతుంది.
ఎందుకంటే కొన్నిసార్లు దొంగతనం కంటే.. దాన్ని చేసిన విధానమే బాగా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా రోడ్లపై, ఇళ్లల్లో బంగారం దొంగిలించాలంటే.. చేయి తిరిగిన దొంగలు అయితేనే దొరకకుండా చోరీ చేసి పారిపోతారు. అలా కాదని ఎవరు పడితే వాళ్లు దొంగతనానికి ట్రై చేస్తే.. అడ్డంగా బుక్ అయి.. కటకటాల్లోకి వెళ్తారు. ఇవి మనం సాధారణంగా చూసే దొంగతనాలే. కానీ ఈ ఘటనలో మాత్రం.. ఓ కాకి భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్లడం ఇప్పుడు అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. 3.5 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని కాకి ఎత్తుకుపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. త్రిస్సూర్ జిల్లా మథిలకం ప్రాంతంలో నివసిస్తున్న షిర్లీ అనే మహిళ.. స్థానికంగా అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తుంది. ఆగస్ట్ 13వ తేదీన.. షిర్లీ అంగన్‌వాడీ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుండగా.. ఆమె మెడలో ఉన్న రూ.3.5 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు గొలుసు తీసి.. మెట్లపై పెట్టింది. ఆ గోల్డ్ చైన్ పక్కనే ఒక ఆహార పొట్లం కూడా ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కాకి.. ఒక్కసారిగా ఆ ఆహార పొట్లాన్ని వదిలేసి.. గోల్డ్ చైన్‌ను తీసుకొని అక్కడి నుంచి ఎగిరిపోయింది. షిర్లీ.. అరుపులు, కేకలతో ఆ కాకి వెంట పరుగులు తీసింది. అది చూసిన స్థానికులు కూడా కాకి వెంట పడ్డారు. మొదట ఒక చెట్టుపై కూర్చున్న కాకి.. ఆ బంగారు గొలుసును అక్కడే విడిచిపెట్టి.. పక్కనే ఉన్న అడవుల్లోకి ఎగిరిపోయింది. ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో వెతకగా.. చివరికి ఆ బంగారు గొలుసు దొరికింది. దీంతో షిర్లీతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కాస్తా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 అంతస్తుల ఎత్తున్న బాహుబలి రాకెట్ అరుదైన ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు
హోటల్ ముందు ఆగిన కారులో అరుపులు.. ఏంటా అని చూడగా
జైలుకెళ్తే ఎంతటి మంత్రి అయినా పదవి ఊస్ట్.. కేంద్రం కొత్త చట్టం
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

