AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 అంతస్తుల ఎత్తున్న బాహుబలి రాకెట్ అరుదైన ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు

40 అంతస్తుల ఎత్తున్న బాహుబలి రాకెట్ అరుదైన ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు

Phani CH
|

Updated on: Aug 24, 2025 | 8:54 AM

Share

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో అరుదైన భారీ రికార్డును సాధించేందుకు రెడీ అవుతోంది. ఈసారి ఏకంగా 40 అంతస్తుల ఎత్తుండే రాకెట్‌ ద్వారా 75 టన్నుల ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ఈ విషయం వెల్లడించారు.

35 కిలోల పేలోడ్‌తో మొదలు పెట్టిన భారతీయ అంతరిక్ష ప్రయాణం.. ఇప్పుడు 75,000 కిలోల బరువైన ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టే స్థాయికి ఎదిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఈ తాజా ప్రయోగం.. ఒక ‘గేమ్-ఛేంజర్’గా మారబోతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచంలో అగ్ర దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలూ ఇలాంటి సూపర్-హెవీ లాంచ్ వెహికిల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రతిపాదిత అంతరిక్ష ప్రయోగంతో.. మన దేశం కూడా ఆ దేశాల సరసన చేరుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. అలాగే, ఇతర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోని తీసుకుపోవటం ద్వారా.. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో మన దేశపు వాటాను గణనీయంగా పెంచుకోవచ్చని ఇస్రో లెక్కలు వేస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి పంపిన 55 ఉపగ్రహాలు భూకక్ష్యలో ఉండగా, వచ్చే మూడు లేదా నాలుగేళ్లలో వీటి సంఖ్య మూడు లేదా నాలుగు రెట్లు పెరగనుందని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాలకు ఇస్రో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చంద్రయాన్-3, మంగళ్‌యాన్ వంటి మిషన్ల విజయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ మెగా రాకెట్ కి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉందని, దీని ద్వారా రక్షణ రంగానికి అవసరమైన భారీ కమ్యూనికేషన్, నిఘా ఉపగ్రహాలను సులభంగా అంతరిక్షంలోకి పంపవచ్చని ఇస్రో చెబుతోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ రక్షణ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో దేశ భద్రతకు, ఆర్థిక ప్రగతికి అంతరిక్ష సామర్థ్యం ఒక కీలకమైన అంశంగా మారనున్న వేళ.. ఇస్రో ప్రయోగం కొత్త ఆశలు రేపుతోంది. మరోవైపు ఇస్రో ఈ ఏడాది డిసెంబర్‌లో తన గగన్‌యాన్-1 టెస్ట్ మిషన్ ప్రయోగానికి కూడా సిద్ధమవుతోంది. ఇటీవలే యాక్సియమ్-4 మిషన్‌ ద్వారా తన అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన శుభాంశు శుక్లా అనుభవం ఈ భారత తొలి మానవసహిత అంతరిక్ష మిషన్​కు కీలకం కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హోటల్ ముందు ఆగిన కారులో అరుపులు.. ఏంటా అని చూడగా

జైలుకెళ్తే ఎంతటి మంత్రి అయినా పదవి ఊస్ట్.. కేంద్రం కొత్త చట్టం

అప్పుడు చిరును నమ్మి ఉంటే.. NTRకు అలా జరిగేది కాదేమో..!

12 ఏళ్ల కూతురురే నటి రెండో పెళ్లికి పెళ్లి పెద్ద

కలుపు తీద్దామని పొలానికి వెళ్తే.. లక్ష్మీ దేవి తలుపు తట్టింది