Airtel: కస్ట్‌మర్లకు ఎయిర్‌టెల్ బిగ్ షాక్..
ప్రధాన టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ.249 ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆగస్టు 20 అమల్లోకి వచ్చింది. మంగళవారం రిలయన్స్ జియో తన కస్ట్‌మర్లకు షాకిస్తూ.. రెండు పాపులర్ రీచార్జ్ ప్లాన్లను తీసివేసింది.
తాజాగా ఎయిర్‌టెల్ కూడా జియో బాటలోనే సాగుతూ.. కస్ట్‌మర్లకు అదే రీతిలో షాకిచ్చింది. ఎయిర్ టెల్ యూజర్లలో ఎక్కువమంది రీఛార్జ్ చేసుకునే రూ.249 ప్లాన్‌ను ప్లాన్‌ను నిలిపివేసింది. కాగా, కంపెనీ నిర్ణయంపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. తక్కువ ధరతో రోజువారీ డేటాను అందించే ప్లాన్లను ఎయిర్ టెల్ తీసేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌టెల్ రూ.249 రీచార్జ్ ప్లాన్‌ను నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా యూజర్లు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSల చొప్పున 24 రోజుల పాటు అందించే ఈ ప్లాన్.. బాగా పాపులర్ అయింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు దీనిని వాడుతూ వస్తున్నారు. చిన్న గడువులో తక్కువ ఖర్చుతో వచ్చిన ఈ “ఎంట్రీ లెవల్” ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. అయితే.. ఎయిర్‌టెల్ ఆగస్టు 20, 2025 నుండి ఈ ప్లాన్ ఇక అందుబాటులో ఉండదని అధికారికంగా ప్రకటించింది. దాంతో ఈ ప్లాన్ ఇప్పుడు ఆన్లైన్‌లో ఎక్కడా కనిపించడం లేదు.. అంటే వినియోగదారులకు ఇక నుంచి దీన్ని రీచార్జ్ చేసుకునే అవకాశం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎంత పని చేసింది కాకి.. చివరికి ఏమైందంటే
40 అంతస్తుల ఎత్తున్న బాహుబలి రాకెట్ అరుదైన ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు
హోటల్ ముందు ఆగిన కారులో అరుపులు.. ఏంటా అని చూడగా
జైలుకెళ్తే ఎంతటి మంత్రి అయినా పదవి ఊస్ట్.. కేంద్రం కొత్త చట్టం
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

