పార్లర్‌కు వెళ్తున్నారా? ఈ ప్రమాదంతో జాగ్రత్త
అందంగా కనిపించేందుకు బ్యూటీపార్లర్లకు వెళ్లి కొత్త సమస్యతో ఆసుపత్రుల పాలవుతోన్న వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. తలతిరగడం, స్పృహ కోల్పోవడం వరకు 'బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్' తో ఇబ్బందులు వస్తున్నాయి. మెదడు రక్తనాళాలపై ఒత్తిడి పడినప్పుడు ఈ స్ట్రోక్ వస్తుంది. ముఖ్యంగా మెడను వెనక్కు వంచి బేసిన్‌పై ఉంచి హెయిర్ వాష్ చేసినప్పుడు మెడ దగ్గరున్న రక్తనాళం నొక్కుకుపోతుంది.
బీపీఎస్ఎస్ చాలా అరుదైనప్పటికీ వస్తే మాత్రం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 92 శాతం మందికి తలనొప్పి లక్షణంతోనే సిండ్రోమ్ మొదలవుతుంది. ‘రక్తనాళాల్లో కొవ్వు పేరుకున్న వారికి బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు పొగతాగేవారు, రక్తపోటు, మధుమేహం, ఒబెసిటీ, లిపిడ్ స్థాయిలు ఎక్కువున్నవారు, ఎప్పుడూ కూర్చుని పనిచేసేవారు, గుండె సంబంధిత వ్యాధులున్న వారికి ఈ సిండ్రోమ్‌తో రిస్క్ ఎక్కువ. హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు మెడకు సరైన సపోర్టు ఇవ్వాలి. ఒత్తిడి లేకుండా ఉండేందుకు మెడకింద ఓ మెత్తని వస్త్రం పెట్టుకోవడం మంచిది. మెడను ఎక్కువగా వెనక్కి వంచొద్దు. అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆపేయమని చెప్పాలి. బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు ఈ స్ట్రోక్‌పై అవగాహన ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. మెదడుకు రక్త సరఫరా తగ్గడం లేదా ఇస్కీమియా వల్ల కలిగే ఇతర స్ట్రోక్‌ల మాదిరిగానే డాక్టర్లు దీనికి చికిత్స చేస్తారు. నిపుణుల సూచనల మేరకే ఇక్కడ మేం మీకు సమాచారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Airtel: కస్ట్‌మర్లకు ఎయిర్‌టెల్ బిగ్ షాక్..
ఎంత పని చేసింది కాకి.. చివరికి ఏమైందంటే
40 అంతస్తుల ఎత్తున్న బాహుబలి రాకెట్ అరుదైన ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు
హోటల్ ముందు ఆగిన కారులో అరుపులు.. ఏంటా అని చూడగా
జైలుకెళ్తే ఎంతటి మంత్రి అయినా పదవి ఊస్ట్.. కేంద్రం కొత్త చట్టం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

