AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లేటుతో ఎగురుకుంటూ వచ్చే వెయిటర్‌ .. ఏ రెస్టారెంట్‌లో అంటే వీడియో

ప్లేటుతో ఎగురుకుంటూ వచ్చే వెయిటర్‌ .. ఏ రెస్టారెంట్‌లో అంటే వీడియో

Samatha J
|

Updated on: Aug 27, 2025 | 7:30 AM

Share

ఓ రెస్టారెంట్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు కారణమేంటంటే.. మిగతా హోటల్స్‌లా కాకుండా ఇందులో విచిత్రమైన ఏర్పాట్లు చేయడమే. భోజనం ఆర్డర్ చేయగానే వెయిటర్‌ తీసుకొచ్చే విధానం ఆకట్టుకుంటోంది. వినూత్న రెస్టారెంట్లు చాలానే చూస్తుంటాం. కస్టమర్లను ఆకట్టుకుకోవడం కోసం నిర్వాహకులు చిత్ర విచిత్రంగా ఆలోచించి ఆఫర్లు పెడతారు.

మరికొందరు జైలు, విమానం, ఆకాశంలో భోజనం చేసేలా వింత అనుభూతి కలిగిస్తుంటారు. ఇలాంటి వింత రెస్టారెంట్ల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. హోటల్లో ఆర్డర్ చేయగానే భోజనం వచ్చిన తీరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన వారంతా.. భోజనం పక్షిలా ఎగురుకుంటూ వచ్చిందిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. బ్యాంకాక్‌లోని ఓ రెస్టారెంట్ ఈ చిత్ర విచిత్ర ఏర్పాట్లు చేసింది. భోజనం ఆర్డర్ చేయడమే ఆలస్యం.. అలా ఎగురుకుంటూ వచ్చేస్తుందన్నమాట. ఇందుకోసం ఆ హోటల్లో జిప్‌లైన్ ఏర్పాటు చేశారు. వెయిటర్‌.. భోజనం ప్లేటు పట్టుకుని జిప్‌లైన్ సాయంతో గాల్లో ఎగురుకుంటూ టేబుల్‌ వద్దకు వస్తాడు. ఆహారం ఆర్డర్ చేసిన వారికి అలా గాల్లో ఎగురుకుంటూ వచ్చి వడ్డిస్తాడు. ఇది చూడ్డానికి కొత్తగా అనిపిస్తుండడంతో భోజన ప్రియులు ఈ హోటల్‌కు క్యూ కడుతున్నారు.ఈ హోటల్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రక రకాల కామెంట్లు చేస్తున్నారు. వెయిటర్‌లా లేడు.. సూపర్‌మ్యాన్‌లా ఉన్నాడు అంటూ కొందరు, ‘అద్భుత ఐడియా.. ఇలాంటి హోటల్‌ని ఎక్కడా చూడలేదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో