Ganesh Chaturthi 2023: ఇక్కడ మాత్రం వినాయక చవితి 12 రోజులు.. బుద్వా గణేశుడిగా పూజలు.. 125 ఏళ్ల నుంచి జ్ఞానాన్ని ఇచ్చే దైవానికి పూజలు..
వినాయక చవితి వేడుకలకు వెరీ వెరీ ఫేమస్ మహారాష్ట్ర. ఇక్కడ మాత్రమే కాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో చవితి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతారు. అయితే ఇదే స్థాయిలో బీహార్‌లోని నలందలో కూడా గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడ లాల్ బాద్షాను పూజిస్తారు. ఇక్కడ ప్రతిష్టించే వినాయకుడిని బుద్వా గణేశుడు అని పిలుస్తారు.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండగ సందడి మొదలైంది. అనేక వీధుల్లో గణపయ్య కొలువుదీరాడు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. హిందువులు పూజించే దేవుళ్లలో గణపతి ఆదిపూజ్యుడు. ఏదైనా పూజలు, శుభకార్యాలు మొదలు పెట్టినా మొదట పూజను గణేశుడికి చేస్తారు. ఈ నేపథ్యంలో భాద్రపద శుక్ల పక్షంలోని చవితి తిథిని గణపయ్య పుట్టిన రోజుగా భావించి ఈ రోజున వినాయక చవితి పండగను జరుపుకుంటారు. గణపయ్య సంపద, సైన్స్, జ్ఞానం, తెలివితేటలు,శ్రేయస్సు కారకుడు. గణేశుడిని 108 రకాల పేర్లతో పిలుస్తారు. గజాననుడు, వినాయకుడు, విఘ్నాలకధిపతి. గణేషుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. వినాయక చవితి వేడుకలకు వెరీ వెరీ ఫేమస్ మహారాష్ట్ర. ఇక్కడ మాత్రమే కాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో చవితి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతారు.
125 ఏళ్ల సంప్రదాయం
బీహార్ షరీఫ్‌లోని నలంద ప్రధాన కార్యాలయంలో ఉన్న సోహ్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలాపూర్‌లో ఆకర్షణీయమైన గణేశుడి విగ్రహం సిద్ధం చేయబడింది. ఆ ప్రదేశంలో ప్రతిష్టించే గణేశుడి పేరు బుద్వా గణేష్. 125 ఏళ్ల క్రితం మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి వ్యాపారులు వ్యాపారం కోసం వచ్చిన.. ఇక్కడే వ్యాపారం కోసం కోసం ఆగిపోయేవారని స్థానికులు చెప్పారు. అలా ఒకసారి గణేష్ చతుర్థి రోజున వ్యాపారులు ఇంటికి వెళ్ళలేకపోయారు. అప్పుడు ఇక్కడ తమ ఇష్టదైవం గణపతి విగ్రహాన్ని తయారు చేసి పూజించారు. అలా ఆ రోజు ప్రారంభమైన గణపతి పూజ నేడు సంప్రదాయంగా మారిపోయింది.
నలందలో 12 రోజులు పూజలు
ఆ సమయంలో ఇక్కడ మండపంలో వెలసిన గణపతిని.. గణేష్ పూజను చూసేందుకు బీహార్‌తో పాటు బెంగాల్, యూపీ నుంచి అనేకమంది భక్తులు కూడా వచ్చేవారని పూజా కమిటీ సభ్యుడు సురేష్ ప్రసాద్ చెప్పారు. ఆ తర్వాత కాలక్రమంలో గణేష్ చతుర్థి సందర్భంగా.. గణపతి విగ్రహాన్ని వివిధ ప్రదేశాలలో ప్రతిష్టించడం ప్రారంభించి, పూజించడం ప్రారంభించారు.
అయితే ఒకప్పుడు బీహార్‌లో వినాయక చవితి అంటే.. ఈ నలంద ప్రాంతంలో మాత్రమే గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్టించేవారు. విశేషమేమిటంటే.. ఇక్కడ ప్రతిష్టించే వినాయకుడిని బుద్వా గణేశుడు అని పిలుస్తారు. అంటే ఆ మండపంలో ప్రతిష్టించిన వినాయకుడు రెడ్ కింగ్ గా ప్రసిద్ధిగాంచాడు. ఎందుకంటే విగ్రహం ఎరుపు రంగులో ఉంటుంది.. పూర్తి నియమానుసారం గణపతిని అలంకరిస్తారు.
వాస్తవానికి వినాయక చవితి పండగను నవరాత్రులుగా 10 రోజులు జరుపుకుంటారు. అయితే నలందలో మాత్రం ఈ ఉత్సవాలను 12 రోజులు జరుపుకుంటారు. భాదో చౌత్‌లో ప్రతిష్టించబడే విగ్రహం ఆ తర్వాత విగ్రహ నిమజ్జనం కోసం తీసుకుని వెళ్లేసమయంలో అశ్విన్ దూజ్‌లో ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ విధంగా మొత్తం 12 రోజుల పాటు పూజలు చేస్తారు. నిమజ్జన సమయంలో భక్తులు ఘనంగా గణపతికి వీడ్కోలు పలుకుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..