- Telugu News Photo Gallery Spiritual photos Tirumala Tirupati: Koil Alwar Thirumanjanam Performed In Tirumala Srivari Temple
Tirupati: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. మధ్యాహ్నం 12 గం. ల తర్వాతే స్వామివారి దర్శనానికి అనుమతి..
తిరుమల ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు.. శ్రీవారి ఆలయంలో ఉన్న ఉన్న గర్భాలయ, ఉప దేవాలయాల పై కప్పులతో పాటు ఆలయ ప్రాంగణం, గోడలతో సహా పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం అర్చకులు సంప్రదాయంగా శుద్ధి చేస్తారు. ఈ ఆలయ శుద్ధి సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. నీటితో శుద్ధి చేసిన అనంతరం ఆలయ పైకప్పులు, గోడలపై పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూస్తారు.
Updated on: Sep 12, 2023 | 10:41 AM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

. ఏడాదిలో ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈనెల 18 నుంచి జరగనుండటంతో ఈ రోజు ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.

వాస్తవానికి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆలయ శుద్ధిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తో పాటు ఈవో ధర్మారెడ్డి ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తిరుమల ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు.. శ్రీవారి ఆలయంలో ఉన్న ఉన్న గర్భాలయ, ఉప దేవాలయాల పై కప్పులతో పాటు ఆలయ ప్రాంగణం, గోడలతో సహా పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం అర్చకులు సంప్రదాయంగా శుద్ధి చేస్తారు.

ఈ ఆలయ శుద్ధి సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. నీటితో శుద్ధి చేసిన అనంతరం ఆలయ పైకప్పులు, గోడలపై పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూస్తారు. ఈ సుగంధ మిశ్రమం... నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలగలిపి తయారు చేస్తారు.

దీనిని ఆలయ సుద్ధి అనంతరం సుగంధాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలంతో దేవాలయం అంతా ప్రోక్షణం చేశారు. ఈ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమం క్రిమి సంహారకంగా పని చేస్తుందని భక్తుల విశ్వాసం.

ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
