- Telugu News Photo Gallery Spiritual photos Ganesh chaturthi 2023: Astro Tips Shubh yoga can give good luck, health and prosperity these lucky zodiac signs
Ganesh Chaturthi 2023: వినాయక చవితిన ఏర్పడనున్న అద్భుతమైన యోగం.. ఈ 3 రాశులపై గణపతి అనుగ్రహం అపారం.. పట్టిందల్లా బంగారమే..
గణేష్ చతుర్థి పండగను ఊరూ వాడా అంగరంగ వైభంగా జరుపుకుంటారు. వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించడమే కాదు.. ఇంట్లో గణపతి విగ్రహాన్ని తీసుకుని వచ్చి నియమాలనుసారం ప్రకారం 10 రోజులు పూజిస్తారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి వెరీ వెరీ స్పెషల్ అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈసారి గణేష్ చతుర్థి నాడు మూడు శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి.
Updated on: Sep 12, 2023 | 12:29 PM

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం చవితి తిథి 18 సెప్టెంబర్ 2023 మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 1:43 వరకు ఈ చవితి తిథి ఉండనుంది. ఈ నేపథ్యంలో కొందరు 18వ తేదీన వినాయక చవితిని చేసుకోవడానికి రెడీ అవుతుండగా... మరికొందరు 19వ తేదీన జరుపుకోనున్నారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం యాదృచ్చికంగా అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాల కారణంగా గణేష్ చతుర్థి పండుగ చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 300 సంవత్సరాల తర్వాత గణేష్ చతుర్థి రోజున మూడు శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ రోజున బ్రహ్మయోగం, శుక్ల యోగం, శుభ యోగం ఉంటాయి.

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి రోజున ఈ ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. దీంతో ఈ ఏడాది గణేష్ చతుర్థి మరింత ప్రత్యేకంగా మారింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి వస్తూ వస్తూ కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకతను అదృష్టాన్ని తీసుకొస్తుంది.

హిందువులకు విశిష్టమైన, పవిత్రమైన పండుగలో కొందరి జాతకంలో పెనుమార్పులు రానున్నాయి. ముఖ్యంగా మూడు రాశులకు చెందిన వ్యక్తులు వినాయక చవితి రోజు నుంచి అదృష్టం వీరి సొంతం. ఈ రాశుల వారిపై గణపతి ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉండడంతో వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

మేష రాశి- గణపతి ఆశీస్సులతో ఈ రాశివారు చేపట్టిన పనులు పెండింగ్ లో ఉంటే ఆ పనులన్నీ పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గణేష్ చతుర్థి రోజున గణేశుడికి సింధూరం సమర్పించండి.

మిథున రాశి -ఈ రాశివారికి గణేశుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. అదృష్టం వీరిని అందలం ఎక్కిస్తోంది. అపార సంపదను పొందే అవకాశాలు ఉన్నాయి. వీరు ఉద్యోగం, వ్యాపారంలో రెట్టింపు వేగంతో లాభాలను పొందుతారు. అంతే కాకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు లభిస్తాయి.

మకర రాశి - ఈ రాశికి చెందిన వ్యక్తులకు వినాయక చవితి నుంచి విశిష్ట స్థానం లభిస్తుంది. ఈ రాశి వారికి గణేష్ చతుర్థి రోజు నుండి గౌరవం , ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఈ రోజున గుడికి వెళ్లి వినాయకుడిని పూజించినా, ఇంట్లో విజయకుడిని ప్రతిష్టించి పూజించినా శుభఫలితాలు వీరి సొంతం. మకర రాశి వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు తొలగిపోతాయి.





























