దక్షిణాయనం ఎప్పటి నుంచి మొదలు కానుంది? ఈ ఏడాది వర్షాలు పడే అవకాశం ఎలా ఉందంటే?

ఈ ఏడాది సూర్యుడు జూలై 6 వ తేదీ తన గమనాన్ని మార్చుకోవడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాడ మాసం రాగానే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. అంతేకాదు రేపు అంటే జూన్ 21 శుక్రవారం కూడా సంవత్సరంలో అత్యంత పొడవైన రోజు.. రాత్రి సుమారు 10 గంటల పాటు ఉంటుంది.

దక్షిణాయనం ఎప్పటి నుంచి మొదలు కానుంది? ఈ ఏడాది వర్షాలు పడే అవకాశం ఎలా ఉందంటే?
Lord Surya Narayana
Follow us

|

Updated on: Jun 20, 2024 | 5:46 PM

హిందూ పంచాంగం ప్రకారం ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయణం. గ్రహాలకు అధినేత సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. తన గమనాన్ని మార్చుకుని మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయణంగా పరిగణిస్తారు. దీంతో పుణ్యకాలం ఉత్తరాయణ పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది. అంటే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ ఏడాది సూర్యుడు జూలై 6 వ తేదీ తన గమనాన్ని మార్చుకోవడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాడ మాసం రాగానే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. అంతేకాదు రేపు అంటే జూన్ 21 శుక్రవారం కూడా సంవత్సరంలో అత్యంత పొడవైన రోజు.. రాత్రి సుమారు 10 గంటల పాటు ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్యదేవుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు కదలడం మొదలు కాగానే వేసవి కాలం వెళ్లి.. వర్షాకాలం మొదలవుతుంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే జూన్ 21 సంవత్సరంలో అతిపెద్ద రోజు అవుతుంది. శుక్రవారం పగటి సమయం 13 గంటల 42 నిమిషాలు.. రాత్రి సమయం 10 గంటల 18 నిమిషాలు ఉంటుంది.

శుక్రవారం సూర్యుడు కర్కాటక రాశికి చాలా దగ్గరగా ఉండనున్నాడు. దీంతో రేపు మధ్యాహ్నం సూర్యుడు నేరుగా నడినెత్తికి రానున్నాడు. కనుక 12:30 గంటల ప్రాంతంలో మనిషి నీడ కనిపించదు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు అడుగు పెట్టడం వలన వాతారణంలో అనేక మార్పులు జరగనున్నాయి. జూన్ 21 న ఉదయం 12:06 గంటలకు, సూర్యదేవుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు, దీని కారణంగా వర్షాలు ప్రారంభ సమయం మెరుగ్గా ఉంటుంది. రుతుపవనాలకు ఉన్న ఆటంకాలు తొలగి అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.