- Telugu News Photo Gallery What will happen if image of Lord Ganesh is placed on main door of the house? check details in Telugu
Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారంపై వినాయకుడి చిత్రాన్ని ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది?
హిందూ మతంలో ఆది దేవుడిగా వినాయకుడిని ముందుగా పూజిస్తారు. ఎలాంటి శుభ కార్యం మొదలు పెట్టినా మొదట బొజ్జ గణపయ్యనే ప్రార్థిస్తాం. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ గణేషుడు చేస్తాడని నమ్మకం. అందుకే ఇంట్లో ఏం చేసినా.. ముందు వినాయకుడిని ప్రార్థించడం అలవాటు. మరి ప్రధాన ద్వారం మీద వినాయకుడి ఫొటో లేదా విగ్రహం ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ శాతం చాలా మంది ఇంటి ముందు గణేశ్ చిత్ర పటాలను..
Updated on: Jun 20, 2024 | 6:44 PM

హిందూ మతంలో ఆది దేవుడిగా వినాయకుడిని ముందుగా పూజిస్తారు. ఎలాంటి శుభ కార్యం మొదలు పెట్టినా మొదట బొజ్జ గణపయ్యనే ప్రార్థిస్తాం. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ గణేషుడు చేస్తాడని నమ్మకం. అందుకే ఇంట్లో ఏం చేసినా.. ముందు వినాయకుడిని ప్రార్థించడం అలవాటు.

మరి ప్రధాన ద్వారం మీద వినాయకుడి ఫొటో లేదా విగ్రహం ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ శాతం చాలా మంది ఇంటి ముందు గణేశ్ చిత్ర పటాలను లేదా విగ్రహాలను అయినా ఉంచుతారు.

ఇంటి ప్రధాన ద్వారంపై పై భాగంలో గణేష్ చిత్ర పటం ఉంచడం వల్ల.. ఎలాంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. ఇలా పెట్టుకోవడం ఇంటికి మంచి జరుగుతుందని నమ్ముతారు.

ప్రధాన ద్వారంపై ఫొటో పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివిటీ రాదు. ఇంట్లో అంతా పాజిటివ్ పరిస్థితి నెలకొంటుంది. కుటుంబ సభ్యలు మధ్య పెద్దగా తగాదాలు చోటు చేసుకోవు. ప్రశాంతంగా ఉంటుంది.

అదే విధంగా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. మీరు ముఖ్యమైన పని మీద వెళ్లినప్పుడు ప్రధాన ద్వారంపై ఉండే గణేష్ చిత్రపటానికి నమస్కరించి వెళ్తే ఎలాంటి అడ్డంకులు ఉండవు.




