Viral News: ఆన్ లైన్‌లో సోడా ఆర్డర్ చేసిన యువకుడు.. గ్లాస్ చూసి షాక్ ..

కొన్ని సార్లు ఇలా ఆహారం ఆర్డర్ పెట్టినప్పుడు కొన్ని లోపాలు కనిపిస్తూ అవి నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఐస్ క్రీమ్ లో వేలు, చాక్లెట్ క్రీమ్ లో ఎలుక వంటివి మాత్రమే కాదు.. ప్రస్తుతం ఓ ఫన్నీ ఘటన చోటు చేసుకుని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఒక వినియోగదారుడు తన కోసం లైమ్ సోడాను ప్రముఖ ఫుడ్ యాప్ స్విగ్గి లో ఆర్డర్ చేశాడు. తనకు వచ్చిన ఆర్డర్ తీసుకున్న తర్వాత అతను ఓ రేంజ్ లో షాక్ తిన్నాడు.

Viral News: ఆన్ లైన్‌లో సోడా ఆర్డర్ చేసిన యువకుడు.. గ్లాస్ చూసి షాక్ ..
Man Order Lime Soda
Follow us

|

Updated on: Jun 20, 2024 | 4:43 PM

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం, బయటి నుంచి ఆహారాన్ని ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకోవడం సర్వ సాధారణమైపోయింది. గృహోపకరణాలను సైతం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం సాధారణ విషయం. తమకు కావాల్సిన వస్తువులను కొన్ని నిమిషాల్లో సులభంగా ఇంటి నుంచి కదలకుండానే కొనేస్తున్నారు. అందుకే ఆన్ లైన్ యాప్స్ పట్ల క్రేజ్ జనాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇలా ఆన్ లైన్ షాపింగ్ చేసే సమయంలో కొన్నిసార్లు తప్పులు కూడా చోటు చేసుకుంటాయి. దీంతో వినియోగదారుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎవరైనా బయటి నుంచి ఆహారాన్ని ఆన్ లైన్ స్విగ్గీ, జోమాతో వంటి యాప్స్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు ఇలా ఆహారం ఆర్డర్ పెట్టినప్పుడు కొన్ని లోపాలు కనిపిస్తూ అవి నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఐస్ క్రీమ్ లో వేలు, చాక్లెట్ క్రీమ్ లో ఎలుక వంటివి మాత్రమే కాదు.. ప్రస్తుతం ఓ ఫన్నీ ఘటన చోటు చేసుకుని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఒక వినియోగదారుడు తన కోసం లైమ్ సోడాను ప్రముఖ ఫుడ్ యాప్ స్విగ్గి లో ఆర్డర్ చేశాడు. తనకు వచ్చిన ఆర్డర్ తీసుకున్న తర్వాత అతను ఓ రేంజ్ లో షాక్ తిన్నాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ పోస్ట్ చూడండి

ఆ కస్టమర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఖాళీగా ఉన్న సీల్డ్ ప్యాక్ గ్లాస్ చిత్రాన్ని షేర్ చేశాడు. అంతేకాదు ‘ఈ సీల్డ్ ప్యాక్ గ్లాస్‌ పంపినందుకు తాను స్విగ్గీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను .. నా లైమ్ సోడా నెక్స్ట్ ఆర్డర్‌ పెట్టినప్పుడు ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాను’ అని కామెంట్ జత చేశాడు. అంతేకాదు ఈ పోస్ట్‌లో స్విగ్గీని ట్యాగ్ కూడా చేశాడు. ఆ వెంటనే ఆయన చేసిన ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ పోస్టుకి స్పందిస్తూ ప్రజలు రకరకాల వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఈ పోస్ట్ రాసే వరకు ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. రకరకాలుగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ఈ పోస్టుపై వ్యాఖ్యానిస్తూ, ‘దుకాణదారు సున్నపు సోడాను పంపి ఉండవచ్చని తాను భావిస్తున్నాను.. అందుకనే వేడి కారణంగా గ్లాస్ లోని సోడా ఆవిరిగా మారిందన్నారు. మరొకరు ఈ కారణాలతోనే మా కుటుంబ సభ్యులు మమ్మల్ని ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తామంటే ఒప్పుకోవడం లేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు చాలా మంది ఇతర వినియోగదారులు ఈ వీడియోపై రాకరాకలుగా ఫన్నీ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?