Chanakya Niti: ప్రత్యర్థి ముందు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది..

Chanakya Niti: ఆచార్య చాణక్యు వ్యక్తి జీవితానికి సంబంధించి ఎన్నో కీలక సూచనలు, సలహాలు, సందేశాలను ఉపదేశం చేశారు. జీవితంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? విజయం సాధించాలంటే..

Chanakya Niti: ప్రత్యర్థి ముందు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది..
Chanakya
Follow us

|

Updated on: Sep 21, 2022 | 1:43 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యు వ్యక్తి జీవితానికి సంబంధించి ఎన్నో కీలక సూచనలు, సలహాలు, సందేశాలను ఉపదేశం చేశారు. జీవితంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? విజయం సాధించాలంటే ఎలా? జీవితం ఆగమైపోవడానికి కారణాలేంటి? ఇలా ప్రతీ అంశాన్ని పేర్కొంటూ నీతిశాస్త్రం అనే గ్రంథాన్ని రచించారాయన. ఆ సూచనలు, సలహాలు, సందేశాలు నేటికీ మార్గదర్శకమే. వాటిని పాటించడం ద్వారా జీవితంలో ఎంతటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కోవచ్చు. విజయంతో ఉన్నత శిఖరానలు చేరవచ్చు. ఈ క్రమంలోనే ఇవాళ మన చాణక్య చెప్పిన కొన్ని కీలక వివరాల గురించి తెలుసుకుందాం. ఆచార్య చాణక్య తన నీతిశాస్త్రంలో శత్రువులతో ఎలా వ్యవహరించారు. వారి ముందు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే వివరాలు పేర్కొన్నారు. శత్రువుల ముందు ఆ తప్పులు చేస్తే పరిస్థితులు మారిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మరి ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

బలహీనత..

ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. తన బలహీనత ఇతరులకు చెప్పకూడదు. శత్రువు అయితే, మరిచిపోయి కూడా వారికి మీ బలహీనతను తెలియనివ్వకూడదు. లేదంటే.. చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రశాంతంగా ఉండాలి..

శత్రువును ఓడించిన తరువాత సహనం కోల్పోవద్దు. బలహీనంగా ఉన్నారనే అనుకోవాలి. ఒకవేళ ఓడిపోతే ఆ సందర్భంలోనూ ప్రశాంతంగా ఉండాలి. ఓపిక పట్టాలి. ఎప్పుడూ గెలవడానికే ప్రయత్నించాలి. ప్రయత్నించడానికి భయపడాల్సిన పనిలేదు. మానసికంగా దృఢంగా ఉండాలి.

శత్రువును బలహీనంగా భావించొద్దు..

ఒక వ్యక్తి తన శత్రువును ఎప్పుడూ బలహీనంగా భావించొద్దు. చాలా సందర్భాల్లో వ్యక్తులు తమ ప్రత్యర్థులను బలహీనులుగా, తమను తాము శక్తివంతులుగా భావించి తప్పుడు పనులు చేస్తాడు. అది మీ శత్రువు విజయాని కారణం అవుతుంది. అందుకని, అతిగా ఆలోచించకుండా.. శత్రువు శక్తి సామర్థ్యాలను అంచనా వేయడం చాలా ముఖ్యం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..