Tirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.. మద్యాహ్నం అవి కూడా..
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు సంంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు మరికొన్ని సేవలకు సంబంధించిన టికెట్ల విడుదలకు సంబంధించి టిటిడి ముఖ్యమైన ప్రకటన జారీచేసింది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ..
Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి సంబంధించి నవంబర్ నెలకు గానూమ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. అలాగే నవంబర్ నెలలో శ్రీవారికి నిర్వహించనున్న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు( సెప్టెంబర్ 21 బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. టికెట్ల లభ్యతను బట్టి మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన కేటాయించనున్నట్లు పేర్కొంది. నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. అక్టోబర్ నెలకు సంబంధించి పొర్లుదండాలు టోకెన్లను సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ తేదీల్లో ప్రదక్షిణం టోకెన్లు జారీ చేయడం లేదని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి భక్తులను కోరింది. అలాగే సెప్టుంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నిలుపుదల చేస్తూ టిటిడి అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి టికెట్లు లేకుండా క్యూలైన్‌లోనే భక్తులను అనుమతించనున్నారు. ఎంత మంది వచ్చినా ఇదే విధానాన్ని అమలుచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..