AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Purnima: చంద్ర దోష నివారణకు, పూర్వీకుల ఆశీర్వాదం కోసం గురు పౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి..

మహాభారతాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడి జన్మ దినోత్సవం. కనుక ఈ ఆషాడ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజు గురువు పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తారు. అంతేకాదు గురు భోధించే జ్ఞానం, మార్గదర్శకత్వం కోసం గౌరవించే సందర్భంగా పరిగణించబడుతుంది. అయితే ఈ ఆషాఢ పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది.

Guru Purnima: చంద్ర దోష నివారణకు, పూర్వీకుల ఆశీర్వాదం కోసం గురు పౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి..
Ashadha Purnima 2024
Surya Kala
|

Updated on: Jul 17, 2024 | 7:02 AM

Share

ఆషాఢ పూర్ణిమ లేదా గురు పౌర్ణమిని ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అన్ని పౌర్ణమిలలో ఆషాఢ పౌర్ణమి అత్యంత విశిష్టమైనది అని హిందువుల నమ్మకం. ఈ ఏడాది ఆషాఢ పౌర్ణమి వ్రతం 2024 జూలై 20వ తేదీ శనివారం రోజున ఆచరిస్తారు. మర్నాడు అంటే జూలై 21వ తేదీన పౌర్ణమి స్నానం, దానం మొదలైనవి చేస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు. పితృ తర్పణ విడిచి దానాలు చేస్తారు. సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం ఆషాడ పౌర్ణమి రోజున చేసే స్నానం, దానాల వలన పాపాలు నశిస్తాయని.. పుణ్యం లభిస్తుందని నమ్మకం.

పౌర్ణమి రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును గురు పౌర్ణమి అని కూడా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ రోజున మహాభారతాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడి జన్మ దినోత్సవం. కనుక ఈ ఆషాడ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజు గురువు పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తారు. అంతేకాదు గురు భోధించే జ్ఞానం, మార్గదర్శకత్వం కోసం గౌరవించే సందర్భంగా పరిగణించబడుతుంది. అయితే ఈ ఆషాఢ పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది.

ఆషాఢ పూర్ణిమ రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే?

పితృ తర్పణం: ఆషాఢ పౌర్ణమి రోజుని పితృ తర్పణం రోజుగా కూడా పరిగణిస్తారు. ఈ రోజున ప్రజలు తమ పూర్వీకులకు నివాళులర్పిస్తారు. వారికి తర్పణం అర్పిస్తారు.

ఇవి కూడా చదవండి

సంపద, కీర్తి కోసం: ఆషాఢ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించండి. పూజలో లక్ష్మీ దేవికి తామర పువ్వులు, ఎరుపు గులాబీలు, గవ్వలను ఉపయోగించండి. మఖానా ఖీర్ లేదా పాలతో చేసిన తెల్లటి స్వీట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అనంతరం శ్రీ సూక్తం లేదా కనకధార స్తోత్రాన్ని పఠించండి.

పూర్వీకులకు ఇష్టమైన ఆహారం: ఆషాఢ పూర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయండి. దీని తరువాత పూర్వీకులను సంతృప్తి పరచడానికి నీరు, నల్ల నువ్వులు దర్భలతో తర్పణం ఇవ్వండి. ఇలా చేయడం వలన పూర్వీకులు సంతృప్తి చెందుతారు. ఈ రోజున ఇంట్లో పూర్వీకులు ఇష్టపడే ఆహారాన్ని తయారు చేసి ఆవు, కాకి, కుక్క మొదలైన వాటికి తినిపించండి.

చంద్రునికి పూజ: పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు 16 దశలతో ఉదయిస్తాడు. అందుకే ఆషాఢ పౌర్ణమి వ్రతం చేసిన రాత్రి చంద్రుడిని పూజించాలి. పచ్చి పాలు, నీరు, తెల్లటి పువ్వులతో అర్ఘ్యం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల చంద్ర దోషం తొలగిపోతుంది.

తెల్ల వస్తువులను దానం ఇవ్వండి: ఆషాఢ పౌర్ణమి రోజున పేద బ్రాహ్మణులకు లేదా పేదవారికి బియ్యం, చక్కెర, తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులు, ముత్యాలు, వెండి మొదలైన తెల్లని వస్తువులను దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు , కీర్తి లభిస్తుంది, మనస్సు ప్రశాంతంగా.. స్థిరంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు