Bhadrakali Temple: శాకాంబరీ ఉత్సవాలు అంటే ఏంటి..? ఆషాడంలోనే ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..!

ప్రపంచానికి శాకంభరీ ఉత్సవాలను పరిచయం చేసిన ఘణత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానిదే... ప్రతియేటా ఆషాడమాసంలో నిర్వహించే శాకంభరీ ఉత్సవాలకు చాలాపెద్ద చరిత్రే ఉంది.. ఆషాడ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్నిరకాల కూరగాయల, పండ్లు, పూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడంవల్ల సర్వసుఖాలు సిద్దిస్తాయని.. చేపట్టిన అన్నిరంగాలలో విజయాలు కలిగి, కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి కరుణాకటాక్షాలతో సర్వ శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాడవిశ్వాసం.

Bhadrakali Temple: శాకాంబరీ ఉత్సవాలు అంటే ఏంటి..? ఆషాడంలోనే ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..!
Bhadrakali Temple
Follow us
G Peddeesh Kumar

| Edited By: Surya Kala

Updated on: Jul 17, 2024 | 7:48 AM

వరాలనిచ్చే చల్లనితల్లి.. ఆషాడంలో ఆరంభపూజలు అందుకునే శక్తిస్వరూపిని.. భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు మహా వైభవంగా జరుగుతున్నాయి.. పౌర్ణమి రోజు భద్రకాళి అమ్మవారు నిండు శాకాంబరీగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.. కురగాయలతో పూజించే శాకంభరీ ఉత్సవాల విశిష్టతేంటీ..? శాకంభరీ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు..? కూరగాయలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనమేంటీ…? కాకతీయ వారసత్వ నగరం ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకంభరీ ఉత్సావాల విశిష్టత గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ప్రపంచానికి శాకంభరీ ఉత్సవాలను పరిచయం చేసిన ఘణత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానిదే… ప్రతియేటా ఆషాడమాసంలో నిర్వహించే శాకంభరీ ఉత్సవాలకు చాలాపెద్ద చరిత్రే ఉంది.. ఆషాడ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్నిరకాల కూరగాయల, పండ్లు, పూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడంవల్ల సర్వసుఖాలు సిద్దిస్తాయని.. చేపట్టిన అన్నిరంగాలలో విజయాలు కలిగి, కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి కరుణాకటాక్షాలతో సర్వ శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాడవిశ్వాసం.

అంతేకాదు కూరగాయలతో అలంకరించి ఆరాధించడంవల్ల కరువుకాటకాలు దరిచేరవని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. .ఆ నమ్మకమే ప్రతియేటా ఈ ఉత్సవాల సమయంలో వేలాదిమంది భక్తులను భద్రకాళి దేవాలయం వైపు ధారపడేలా చేస్తుంది.. ఆషాడశుద్ద పాడ్యమినాడు ప్రారంభమయ్యే శాకంభరీ ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. శాకంబరీ ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢవిశ్వాసాన్ని వ్యక్త పరుస్తున్నారు..

ఇవి కూడా చదవండి

ఓరుగల్లులో భద్రకాళి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహించిన తరువాతే వివిధ రాష్ట్రాల్లోని దేవతామూర్తులు, దేశంలోని వేరువేరు ఆది పరాశక్తులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు..ఈ శాకంబరీ ఉత్సవాలకు కేవలం వరంగల్ జిల్లా నుండే కాకుండా వివిద జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా భక్తులు హాజరవుతారు.. విదేశాలలో స్థిరపడ్డ వరంగల్ వాసులు కూడా శాకంబరీ ఉత్సవాల సమయంలో ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. భద్రకాళి అమ్మవారు నిండు శాకంబరీగా దర్శనమిచ్చిన రోజున ఎలాంటి కోరికకోరుకున్నా..ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు..

ఆలయ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ శాకంబరీ ఉత్సవాలకు చాలా పెద్దచరిత్రే ఉంది. పూర్వం వందేళ్ల కరువు ఒకేసారి సంబవించినప్పుడు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారట. అలాంటి సమయంలో భద్రకాళి అమ్మవారిని వేడుకోగా.. తన శరీరం నుండి ధన దాన్యాలు, కూరగాయలు, అన్న పానియాలు విడిచి ప్రజలు కష్టాలు తీర్చిందని చెపుతుంటారు.. కష్ట కాలంలో అమ్మవారు ప్రజల ప్రాణాలు కాపాడారు కాబట్టే అప్పటి నుండి అమ్మవారిని అన్నిరకాల కూరగాయలు,పండ్లు ఫలాలతో ఆరాదించి శాంతింపచేయాలని నిర్ణయించారు.. అప్పటినుండి ఈ శాకంబరీ ఉత్సవాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. క్రమం తప్పకుండా శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడంవల్ల అతివృష్టి, అనావృష్టి ప్రజల దరిచేరవని ఆలయ అర్చకులంటున్నారు.

వందల యేళ్ళనుండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ… 1979 నుండి అశేషంగా జరుగు తున్నాయి.. వరంగల్ లోని భద్రకాళి దేవాలయంలో శాఖంబరీ ఉత్సవాలు ప్రారంభమైన అనంతరం విజయవాడలోని కనకధర్గ అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తారు. పాడ్యమి రోజు ప్రారంబమైన శాకంబరీ ఉత్సవాలు, 21 తేదీన పౌర్ణమితో ముగిస్తాయి. పక్షంరోజులు 15 అవతారాలలో అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. అందులో కామేశ్వరి, కపాళినీ, కుల్లాక్రమం, భేరుండాక్రమం, విరోధినీక్రమం, వహ్నివాసినీ క్రమం, మహావజ్రేశ్వరీక్రమం, శివదూతిక్రమం, త్వరితాక్రమం, కులసుందరీక్రమం, నీలాక్రమం, నీలపతాకాక్రమం, విజయాక్రమం, సర్వంగళా క్రమం, జ్వాలామాలినీ క్రమం రూపాలలో అమ్మవారు దర్శనం ఇస్తారు..చివరిరోజు ఆషాడసుద్ద పౌర్ణమిరోజు సంపూర్ణ శాకంబరీగా అమ్మవారు దర్శనం ఇస్తారు .

భద్రకాళి ఆలయంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకంటే ఈ శాకాంబరీ ఉత్సవాలకు చాలా విశిష్టత ఉంటుంది…కేవలం సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు- అకుకూరలను మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు..ఈ ఉత్సవాలకు చాలా ప్రసిద్ది ఉండడంవల్ల వీఐపీలు, ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకొని పరవశించిపోతుంటారు.. కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాలను కనులార తిలకిస్తున్న ఓరుగల్లు ప్రజలు పులకరించి పోతున్నారు.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సృష్టిలో లభించే కూరగాయలతో ఆ దేవతామూర్తిని అలంకరించి ఆరిదించడమే ఈ ఉత్సవాల విశిష్టత.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!