Doda Encounter: దోడా ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఇద్దరు ఏపీ జవాన్లు.. నివాలులర్పించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

గత కొద్దిరోజుల నుంచి జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్‌తో సహా ఐదుగురు జవాన్లు చనిపోవడం అందరిని కలిచివేసింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జవాన్లలో ఇద్దరు తెలుగువారున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంకు చెందిన రాజేశ్‌ , జగదీశ్వరరావు కూడా ఉగ్రదాడిలో చనిపోవడం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమర జవాన్లకు ఘననివాళి అర్పించారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు. జవాన్ల కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Doda Encounter: దోడా ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఇద్దరు ఏపీ జవాన్లు.. నివాలులర్పించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
Doda Encounter
Follow us

|

Updated on: Jul 17, 2024 | 7:26 AM

జమ్ముకశ్మీర్‌లో హైబ్రీడ్‌ టెర్రరిస్టుల దాడులు కలకలం రేపుతున్నాయి. దోడా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు వారితో పాటు ఐదుగురు జవాన్ల వీరమరణం కలిచివేస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు భారీ కూంబింగ్‌ను చేపట్టాయి. పాకిస్తాన్‌ లోని టెర్రర్‌ శిబిరాలను అంతం చేస్తేనే కశ్మీర్‌లో ఉగ్రపీడ విరగడవుతుందని అంటున్నారు రక్షణరంగ నిపుణులు.

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రూట్ మార్చారా ? టెర్రర్‌ దాడులు స్టయిల్‌ మారిందా ? అందుకే ఆర్మీకి వరుస దెబ్బలు తగులుతున్నాయా ? అవుననే చెప్పుకోవాలి. జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టుల వ్యూహం మారింది. గతంలో కంటే భిన్నమైన రీతిలో దాడులు జరుగుతున్నాయి. దీనికి పాక్‌ ఐఎస్‌ఐ కారణమన్న వాదన బలంగా విన్పిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్‌తో సహా ఐదుగురు జవాన్లు చనిపోవడం అందరిని కలిచివేసింది.

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జవాన్లలో ఇద్దరు తెలుగువారున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంకు చెందిన రాజేశ్‌ , జగదీశ్వరరావు కూడా ఉగ్రదాడిలో చనిపోవడం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమర జవాన్లకు ఘననివాళి అర్పించారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు. జవాన్ల కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.నందిగం మండలం వల్లభరాయుడిపాలెం గ్రామానికి చెందిన సనపల జగదీశ్వరరావు, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర పంచాయతీకి చెందిన యువజవాన్ డొక్కరి రాజేష్ ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. సోమవారం రాత్రి నుంచి దోడాలో ఉగ్రవాదులు . సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే గతంలో కంటే భిన్నంగా ఉగ్రవాదులు ఈసారి భద్రతా బలగాలను టార్గెట్‌ చేయడం అందరిని ఆశ్చర్చ పర్చింది. కశ్మీర్‌లో హైబ్రీడ్‌ టెర్రరిజానికి పాక్‌ ఐఎస్‌ఐ పన్నాగం పన్నుతోంది. గతంలో ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేని యువకులకు ట్రయినింగ్‌ ఇచ్చి దాడులు చేస్తున్నారు. కశ్మీర్‌ టైగర్స్‌ , కశ్మీర్‌ రెసిస్టెంట్‌ ఫోరమ్‌ అనే ఉగ్రవాద సంస్థల పేరుతో తాజా దాడులు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గత నెల లోనే 9 సార్లు దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. టెర్రర్‌ దాడుల్లో 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు నెలల్లో 40 మందికి పైగా జవాన్లు అమరులు కావడం ఆందోళన కలిగించే పరిణామంగా చెప్పుకోవాలి. ఉద్యోగాలు చేసుకుంటూ , సాధారణ పౌరుల్లా జీవిస్తూ కొంతమంది అప్పుడప్పుడు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటునట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలాంటి హైబ్రీడ్‌ ఉగ్రవాదులకు గుర్తించడం కష్టమన్న సందేహాలు కలుగుతున్నాయి.

అయినప్పటికి దాడులకు పాల్పడ్డ వాళ్లను వదిలే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతోంది. దోడాతో పాటు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతోంది. డ్రోన్ల సాయంతో ఉగ్ర స్థావరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తప్పుడు విధానాల కారణంగా మన సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రోజుకొకటిగా జరుగుతున్న ఈ దారుణ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని రాహుల్‌ అన్నారు. ఎక్స్‌ వేదికగా రాహుల్‌ స్పందించారు. ఈ టెర్రరిస్ట్‌ దాడులు జమ్ము కశ్మీర్‌లోని దారుణ పరిస్థితిని తెలియజెప్తున్నాయని రాహుల్‌ తెలిపారు. ఈ భద్రతా లోపాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని రాహుల్‌ డిమాండ్ చేశారు.

పాకిస్తాన్‌ ఆర్ధిక వ్యవస్థ సర్వనాశనమయ్యింది. ఒక్క యుద్దం జరిగితే ఆ దేశం ఆచూకీ ఉండదు. శాశ్వతంగా పీడ విరగడవుతుంది. పాకిస్తాన్‌ మనకు పోటీ కాదని కొందరు అంటున్నారు. అయితే వాళ్ల పనిపట్టండి.. పామును చంపేయండి. పామును పాలు పోసి పెంచడం మంచిదికాదు. పాకిస్తాన్‌ డ్రామాలను ఆపే వరకు ఇలాంటి ఉగ్రదాడులు ఆగవు

దోడా ఉగ్రదాడిపై జమ్ముకశ్మీర్‌లో నిరసనలు హోరెత్తాయి. జమ్ములో డోగ్రా ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉగ్రవాదుల , పాకిస్తాన్‌ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. టెర్రరిస్టులకు ప్రోత్సాహం ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్దంపూర్‌లో కూడా నిరసనలు హోరెత్తాయి. అమర జవాన్ల ప్రాణత్యాగానికి ప్రతీకారం తీర్చుకోవాలని హిందూ సంఘాల కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దోడా ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఇద్దరు ఏపీ జవాన్లు..
దోడా ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఇద్దరు ఏపీ జవాన్లు..
ఓటీటీలోకి అవికా గోర్ హారర్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి అవికా గోర్ హారర్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సామాన్యులే టార్గెట్‌.. ఇడ్లీల లెక్క కిడ్నీ ఫర్‌ సేల్‌
సామాన్యులే టార్గెట్‌.. ఇడ్లీల లెక్క కిడ్నీ ఫర్‌ సేల్‌
వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి
వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి
ఈ సులభమైన పరిహారాలు చేయండి.. పూర్వీకుల ఆశీర్వాదం మీ సొంతం
ఈ సులభమైన పరిహారాలు చేయండి.. పూర్వీకుల ఆశీర్వాదం మీ సొంతం
పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..
పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..
భారీ వర్షాలను సైతం లెక్కచేయని సోనూసూద్.. తడుస్తూనే ప్రజలకు సాయం
భారీ వర్షాలను సైతం లెక్కచేయని సోనూసూద్.. తడుస్తూనే ప్రజలకు సాయం
కేజీఎఫ్‌లో నెల్లూరు యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
కేజీఎఫ్‌లో నెల్లూరు యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..
ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.? ఇలాంటి కాల్స్ కన్ఫాం
ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.? ఇలాంటి కాల్స్ కన్ఫాం
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై