AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాయదారి పిడుగు పడితే అంతా మటాష్.. మరి ప్రాణాలు రక్షించుకోవడం ఎలా..?

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా దేశంలో 8,060 మరణాలు సంభవించగా.. అందులో 2,887 మరణాలకు మాయదారి పిడుగు పాటే కారణం. అంటే ప్రకృతి విపత్తుల మరణాల్లో 35.8 శాతం మరణాలకు పిడుగులే కారణమవుతున్నాయి.

మాయదారి పిడుగు పడితే అంతా మటాష్.. మరి ప్రాణాలు రక్షించుకోవడం ఎలా..?
Lightning Strikes
Janardhan Veluru
| Edited By: Ravi Panangapalli|

Updated on: Jul 17, 2024 | 9:55 AM

Share

ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు.. నిత్యం మనిషిని వెంటాడుతున్నాయి. సహజంగా మనం వరదలు, భూకంపాలు, వడగాలులను ప్రకృతి విపత్తులుగా పరిగణిస్తుంటాం. పిడుగును పెద్ద ప్రకృతి విపత్తుగా ఎవరూ భావించరు. అయితే అన్నింటికంటే పిడుగే అత్యంత ప్రమాదకారిగా ఎన్నోసార్లు నిరూపితం అయింది. దేశంలో ప్రకృతి వైపరీత్యాలతో సంభవించే మరణాల్లో అత్యధిక మరణాలకు కారణం పిడుగులే. ఐఎండీ గణాంకాల మేరకు మాయదారి పిడుగుల కారణంగా ఏటా దేశంలో 2,500కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక మేరకు 2022లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 8,060 మరణాలు సంభవించగా.. అందులో 2,887 మరణాలకు పిడుగు పాటే కారణం. అంటే ప్రకృతి వైపరీత్య మరణాల్లో 35.8 శాతం మరణాలకు పిడుగులే కారణమవుతున్నాయి. భారీ వర్షాలు, కొండ చెరియలు విరిగిపడిన ఘటనల్లో 358 మంది మృతి చెందగా.. దీనికి చాలా రెట్లు ఎక్కువగా పిడుగుల వర్షానికి మృత్యువాతపడ్డారు. ఆ ఏడాది అత్యధికంగా మధ్యప్రదేశ్ (496), బీహార్ (329), మహారాష్ట్ర (239)లో సంభవించాయి. Lightning Strikes NCRB నివేదిక మేరకు ప్రకృతి విపత్తులతో తమిళనాడులో 93 మరణాలు సంభవించగా.. అందులో పిడుగుపాటు మరణాలు 89. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో 248 మరణాల్లో 210 మరణాలకు పిడుగులు కారణం. పశ్చిమ బెంగాల్‌లో 195 మరణాల్లో 161 పిడిగుల కారణంగా సంభవించినవే. కర్ణాటకలో 140 మంది ప్రకృతి విపత్తుల కారణంగా మరణించగా.. వీరిలో 96 మంది పిడుగుపాటుతో కన్నుమూశారు. 2019...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి