Karnataka: కర్ణాటక రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. వందశాతం కన్నడిగులకే ఉద్యోగాలు..!

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ సంస్థల్లో కిందిస్థాయి ఉద్యోగాలను వందశాతం కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది. కన్నడిగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

Karnataka: కర్ణాటక రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. వందశాతం కన్నడిగులకే ఉద్యోగాలు..!
Siddaramaiah Dk Shivakumar
Follow us

|

Updated on: Jul 17, 2024 | 9:38 AM

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ సంస్థల్లో కిందిస్థాయి ఉద్యోగాలను వందశాతం కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది. కన్నడిగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విప్లవాత్మక బిల్లును జూలై 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది కర్నాటక ప్రభుత్వం.

ఈ బిల్లు ప్రకారం ప్రైవేట్‌ సంస్థల్లోని గ్రూప్‌-సి, గ్రూప్‌-డి పోస్టులను కచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్‌మెంట్‌ కేటగిరిలో 50శాతం మందిని, నాన్‌-మేనేజ్‌మెంట్‌ కేటగిరీలో 70శాతం మందిని, కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలోని ఏ ప్రైవేట్‌ సంస్థకైనా ఈ రూల్‌ను తప్పనిసరి చేయబోతోంది ప్రభుత్వం.

మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సులను ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. దీని అమలుతో ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అయితే దీని అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పెరుగుతుంది. ఏడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని 27.5 శాతం పెంచాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే సుధాకర్‌రావు నేతృత్వంలోని ఏడో వేతన సంఘం సిఫారసు చేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.17,440.15 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై