Lord Hanuman Temple: ఈ ఆలయంలో నల్ల రంగులో హనుమాన్ విగ్రహం.. దీని వెనుక పురాణ కథ ఏమిటంటే?

జైపూర్‌లోని హవా మహల్ సమీపంలో హనుమంతుడు ఆలయం ఉంది. ఇక్కడ ఆలయంలో హనుమాన్ విగ్రహం నల్లని రంగులో ఉంటుంది. కనుక ఈ ఆలయాన్ని నల్ల హనుమంతుడు ఆలయం అని పిలుస్తారు. ప్రతిరోజూ భక్తులు ఇక్కడ హనుమంతుడు దర్శనం కోసం వస్తాయి. అయితే ఈ భక్తుల రద్దీ మంగళవారం అత్యధికంగా ఉంటుంది. ఈ ఆలయంలో హనుమంతుడు తూర్పు ముఖంగా ఉన్నాడు.

Lord Hanuman Temple: ఈ ఆలయంలో నల్ల రంగులో హనుమాన్ విగ్రహం.. దీని వెనుక పురాణ కథ ఏమిటంటే?
Lord Hanuman Temple
Follow us

|

Updated on: Jul 17, 2024 | 9:26 AM

శ్రీరాముని పరమ భక్తుడు హనుమంతుడు. పురాణాల ప్రకారం హనుమంతుడు తనకు శ్రీరామునిపై తన భక్తిని, విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి తన శరీరాన్ని సింధురంతో నింపుకున్నాడు. చిరంజీవి అయిన హనుమంతుడు కలియుగంలో తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే ఆ సేతు హిమాచలం ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. చిన్న చిన్న గల్లీ నుంచి భారీ విగ్రహాలు దర్శనం ఇస్తాయి. అయితే ఒక ప్రాంతంలో మాత్రం హనుమంతుడు నల్లని రూపంలో దర్శనం ఇస్తాడు. దీని సంబంధించిన పురాణం కథ కూడా ఉంది. ఆ ఆలయం ఎక్కడ ఉంది .. విశిష్టత ఏమిటి తెలుసుకుందాం..

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే

జైపూర్‌లోని హవా మహల్ సమీపంలో హనుమంతుడు ఆలయం ఉంది. ఇక్కడ ఆలయంలో హనుమాన్ విగ్రహం నల్లని రంగులో ఉంటుంది. కనుక ఈ ఆలయాన్ని నల్ల హనుమంతుడు ఆలయం అని పిలుస్తారు. ప్రతిరోజూ భక్తులు ఇక్కడ హనుమంతుడు దర్శనం కోసం వస్తాయి. అయితే ఈ భక్తుల రద్దీ మంగళవారం అత్యధికంగా ఉంటుంది. ఈ ఆలయంలో హనుమంతుడు తూర్పు ముఖంగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

నల్ల హనుమంతుడు విగ్రహ రహస్యం

దేశంలో హనుమంతుడికి సంబంధించిన అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం నలుపు రంగు విగ్రహాన్ని పూజిస్తారు. పురాణాల ప్రకారం హనుమంతుడు.. ప్రత్యక్ష దైవం సూర్యుడి వద్ద తన విద్యను పూర్తి చేశాడు. అప్పుడు తన గురువు సూర్యుడిని గురు దక్షిణ కోసం అడగమని కోరాడు. అప్పుడు సూర్యుడు తన శిష్యుడు హనుమంతుడితో తన కుమారుడు శనీశ్వరుడు తన మాట వినడం లేదని అతనిని తిరిగి తీసుకురావాలని అభ్యర్థించాడు. ఇదే తనకు ఇవ్వాల్సిన గురుదక్షిణ అని చెప్పాడు.

శనీశ్వరుడు వద్దకు హనుమంతుడు

గురువు కోరిక విన్న హనుమంతుడు శనీశ్వరుడు వద్దకు చేరుకున్నాడు. అతని తండ్రి వద్దకు తిరిగి రావాలని ప్రార్థించడం ప్రారంభించాడు. అయితే శనీశ్వరుడు హనుమంతుడిని చూసిన తర్వాత చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు శనీశ్వరుడు దృష్టి హనుమంతుడిపై పడింది. దీంతో హనుమంతుడి ఛాయ నల్లగా మారింది.

వరం ఇచ్చిన శనీశ్వరుడు

శనీశ్వరుడు దృష్టి పడినా హనుమంతుడిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. హనుమంతుడు శనీశ్వరుడిని ఒప్పించడంలో విజయం సాధించాడు. దీంతో శనీశ్వరుడు.. హనుమంతుడు భక్తికి కార్యదీక్షకు సంతోషించాడు. ఎవరైనా శనివారం రోజున హనుమంతుడిని పూజిస్తే.. తన ప్రభావం ఆ వ్యక్తిపై చూపదని వాగ్దానం చేశాడు.

దారం కట్టుకుంటే వ్యాధులు నయం

హనుమంతుని ఆశీస్సులతో ఇక్కడ అద్భుత ఒక దారం తయారు చేయబడిందని నమ్మకం. ఈ ఆలయంలోని దారం కోసం విదేశాల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తారని ఒక ప్రత్యేక నమ్మకం. ఇక్కడ ఇచ్చే దారం పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇది పిల్లల ఆరోగ్యాన్ని బాగు చేస్తుందని నమ్మకం. అంతేకాదు హనుమంతుని దర్శనం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను దూరప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..