ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 13 మంది భారతీయుల సహా 16 మంది సిబ్బంది గల్లంతు..

కొమొరోస్ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్ రాస్ మద్రాకాకు ఆగ్నేయంగా కొన్ని మైళ్ల దూరంలో..  దుక్మ్ నౌకాశ్రయానికి సమీపంలో ఈ ఆయిల్ ట్యాంకర్  బోల్తా పడినట్లు మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఓడకు సంబంధించిన వివరాలను  Xలో పోస్ట్ చేసింది. ఈ నౌకను ప్రెస్టీజ్ ఫాల్కన్‌గా గుర్తించినట్లు వెల్లడించింది.

ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 13 మంది భారతీయుల సహా 16 మంది సిబ్బంది గల్లంతు..
Oil Tanker Capsized
Follow us
Surya Kala

|

Updated on: Jul 17, 2024 | 8:50 AM

ఒమన్ తీరంలో పెను ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.  సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 13 మంది భారతీయులతో సహా 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. ఓడలో ముగ్గురు శ్రీలంక సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన సిబ్బందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ ఎవరి జాడ లభ్యంకాలేదు.

కొమొరోస్ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్ రాస్ మద్రాకాకు ఆగ్నేయంగా కొన్ని మైళ్ల దూరంలో..  దుక్మ్ నౌకాశ్రయానికి సమీపంలో ఈ ఆయిల్ ట్యాంకర్  బోల్తా పడినట్లు మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఓడకు సంబంధించిన వివరాలను  Xలో పోస్ట్ చేసింది. ఈ నౌకను ప్రెస్టీజ్ ఫాల్కన్‌గా గుర్తించినట్లు వెల్లడించింది. డుక్మ్ పారిశ్రామిక ప్రాంతంలో ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉంది.

గల్లంతైన సిబ్బంది కోసం అన్వేషణ

బోల్తా పడడంతో ఓడకు సంబంధించిన సిబ్బంది తప్పిపోయినట్లు MSC తెలిపింది.  గల్లంతైన వారి కోసం అన్వేషణ సాగుతోందని వెల్లడించింది. ఆ చమురు శుద్ధి కర్మాగారం ఒమన్ దేశంలో అతిపెద్ద ఏకైక ఆర్థిక ప్రాజెక్ట్ గా తెలుస్తోంది. అంతేకాదు నగరంలోని ప్రసిద్ధి చెందిన పారిశ్రామిక ప్రాంతంలో కూడా భాగం  కూడా..

యెమెన్ వైపు వెళ్తున్న ఓడ

ఒమన్  నైరుతి తీరంలో సుల్తానేట్ ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు సమీపంలో దుక్మ్ నౌకాశ్రయం ఉంది. యెమెన్‌లోని ఓడరేవు నగరం ఏడెన్‌ వైపు ఆయిల్‌ ట్యాంకర్‌  వెళ్తున్నట్లు సమాచారం. ఈ  ఆయిల్ ట్యాంకర్ సముద్రంలో తలకిందులుగా పడి ఉంది.  117 మీటర్లు ఉన్న ఈ  నౌకను 2007లో నిర్మించినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న ప్రయాణాలకు.. తక్కువ దూరంలో ఆయిల్ ను తరలించడానికి ఇటువంటి చిన్న ట్యాంకర్లను ఉపయోగిస్తారని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..