భారత్‌పై భారీ దాడికి చైనా ప్లాన్.. POK సమీపంలో 13,000 అడుగుల ఎత్తులో సైనిక స్థావరం..!
తూర్పు లడఖ్‌లో విజయం సాధించలేకపోయిన చైనా ఇప్పుడు పీఓకేపై కన్నేసింది. కజకిస్థాన్‌లో 13 వేల అడుగుల ఎత్తులో చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రదేశం PoK కి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో రహస్య సైనిక స్థావరాన్ని నిర్మించి అక్కడ ఫిరంగిని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది.
తూర్పు లడఖ్‌లో విజయం సాధించలేకపోయిన చైనా ఇప్పుడు పీఓకేపై కన్నేసింది. కజకిస్థాన్‌లో 13 వేల అడుగుల ఎత్తులో చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రదేశం PoK కి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో రహస్య సైనిక స్థావరాన్ని నిర్మించి అక్కడ ఫిరంగిని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. అయితే ప్రస్తుతం మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలను చైనా పూర్తిగా తోసిపుచ్చింది.
చైనాకు ఎప్పుడూ విస్తరణవాద ఆలోచనే ఉంది. పొరుగు దేశాల భూభాగాన్ని కబ్జా చేసేందుకు చైనా ఎప్పుడూ ప్రయత్నిస్తోంది. ఈసారి కజకిస్థాన్‌లో పీఓకే పక్కనే చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని, దశాబ్దాలుగా ఈ పని కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. కజకిస్తాన్‌లో దాదాపు దశాబ్ద కాలంగా చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని, శాటిలైట్ చిత్రాల ద్వారా ది టెలిగ్రాఫ్ తన నివేదికలో వెల్లడైంది. ఇది 13 వేల అడుగుల ఎత్తులో ఉంది. సోవియట్ యూనియన్ రష్యా నుండి విడిపోయిన తరువాత కజకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
ఇలాంటి వార్తలు మీడియాలో రావడంతో చైనా స్పందించింది. కజకిస్థాన్‌లోని చైనా సైనిక స్థావరంపై మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు, నిరాధారమైనవని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. వాస్తవానికి, మాక్సర్ టెక్నాలజీస్ ఉపగ్రహం నుండి తీసిన కొన్ని చిత్రాలను పంచుకుంది. దీనికి సంబంధించి చైనా రహస్య సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని పేర్కొంది. సైనిక స్థావరం గోడలు, యాక్సెస్ రోడ్లు చిత్రాలలో స్పష్టం కనిపిస్తాయి.
కౌంటర్ టెర్రర్ బేస్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది, ఈ సైనిక స్థావరంపై రెండు దేశాలు నిఘా టవర్లను ఏర్పాటు చేసినట్లు మీడియా నివేదికలలో కూడా పేర్కొంది. సైనిక స్థావరం నిర్మించిన స్థలం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఎందకంటే ఇది ఆఫ్ఘన్ సరిహద్దులో ఉంది. ఇది దాదాపు 4 వేల మీటర్ల ఎత్తులో పర్వతంపై నిర్మించారు. రెండు దేశాలు దీనిని 2021 సంవత్సరంలో నిర్మించాయి. దీనికి కౌంటర్ టెర్రర్ బేస్ అని పేరు పెట్టారు. ఈ సైనిక స్థావరం ద్వారా మధ్య ఆసియాలో చైనా తన పట్టును బలపరుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…