AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చెప్పుల ధర అక్షరాల లక్ష రూపాయలు..! టాయిలెట్‌కి వాడుతామంటున్న నెటిజన్లు..స్పెషల్ ఏంటంటే..

కేవలం 200 రూపాయలకే ఇక్కడ కొనుగోలు చేసుకుని అక్కడ 500-1000 రూపాయల వరకు అమ్ముకోవచ్చునని చెబుతున్నారు. ప్రపంచంలో ఎంత మోసం జరుగుతుందో దీన్ని బట్టి తెలుస్తుందని మరొకరు అంటున్నారు కేవలం రూ.100 లోపు విలువ చేసే చెప్పులు రూ.లక్షకు అమ్ముతున్నారని మరొకరు రాశారు.

ఈ చెప్పుల ధర అక్షరాల లక్ష రూపాయలు..! టాయిలెట్‌కి వాడుతామంటున్న నెటిజన్లు..స్పెషల్ ఏంటంటే..
Trendy Slippers
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2024 | 7:24 PM

Share

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఒక పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాశంగా మారింది. సాధారణంగా చెప్పుల ధర ఎంత ఉంటుంది.? 200 నుంచి ఓ 500 వరకు ఉంటుంది. ఇక ధనవంతులు ధరించే చెప్పుల ఖరీదు వెయ్యి, రెండు,మూడు వేలు కూడా ఉండోచ్చు. కొంతమంది ఇంకా ఖరీదైనవి ధరింస్తారు. కానీ, కువైట్‌లోని ఒక దుకాణంలో వేలల్లో కాదు లక్షల్లో అమ్ముతున్నారు. ఆ చెప్పుల్ని చూస్తే మాత్రం మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చెప్పులు మన దేశం చాలా మంది ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు లేదా టాయిలెట్‌లో ఉపయోగించేటప్పుడు ధరించే స్లిప్పర్‌లతో సమానంగా ఉంటాయి.

ఒక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చెప్పుల అమ్మకానికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియోలో చెప్పుల నాణ్యత, దాని ధరను ప్రస్తావించారు. అయితే మన దగ్గర సాధారణంగా కనిపించే ఈ చెప్పుల ధర విని భారతీయులు ఆశ్చర్యపోయారు. వీడియోలో కనిపించినట్టుగా ఈ చెప్పుల ధర 4500 Saudi Riyalsగా ప్రకటించారు. అంటే సుమారు రూ. 1 లక్ష రూపాయలకు సమానం. ఇంట్లో వాడే స్లిప్పర్స్ లా ఉండే ఈ చెప్పుల ధర లక్ష రూపాయలు అని వినగానే భారతీయ జనాలు దానిపై ఫన్నీగా చర్చించుకుంటున్నారు. నేను టాయిలెట్‌కి వెళ్లడానికి ఇలాంటి స్లీపర్స్‌ని మాత్రమే ఉపయోగిస్తానని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ చెప్పులు నేను 60 రూపాయలకే కొంటానని ఒకరు రాశారు.

ఈ స్లిప్పర్ గరిష్ట ధర 250 రూపాయలు అని చాలా మంది నెటిజన్లు రాశారు. ఇంతకంటే ఎక్కువ చెల్లించడం వ్యర్థం అంటున్నారు. ఈ స్లిప్పర్‌ను ఇండియా నుండి కువైట్‌కి ఎగుమతి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకరు రాశారు. కేవలం 200 రూపాయలకే ఇక్కడ కొనుగోలు చేసుకుని అక్కడ 500-1000 రూపాయల వరకు అమ్ముకోవచ్చునని చెబుతున్నారు. ప్రపంచంలో ఎంత మోసం జరుగుతుందో దీన్ని బట్టి తెలుస్తుందని మరొకరు అంటున్నారు కేవలం రూ.100 లోపు విలువ చేసే చెప్పులు రూ.లక్షకు అమ్ముతున్నారని మరొకరు రాశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో @kuwaitinside పేరు గల ఖాతా నుండి షేర్‌ చేయబడింది. ఇది కువైట్‌కు సంబంధించిన స్థానిక సమాచారాన్ని షేర్ చేస్తుంది. ఒక్క రోజులోనే ముప్పై లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. వేలాది మంది ప్రజలు కామెంట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?