ఆ గుడిలో స్వామిని దర్శించుకోవాలంటే.. భక్తులకు లగేజీ భారం తప్పదా.!

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి దర్శనం కోసం వస్తున్న యాత్రికులకు ఆలయం వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో దాదాపు 15 వేల మంది భక్తులు ప్రతిరోజూ శ్రీ గోవిందరాజ స్వామిని కూడా దర్శించుకుంటారు. తిరుపతి రైల్వే స్టేషన్‎కు పక్కనే ఉన్న శ్రీ గోవిందరాజ స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.

ఆ గుడిలో స్వామిని దర్శించుకోవాలంటే.. భక్తులకు లగేజీ భారం తప్పదా.!
Tirumala
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 16, 2024 | 9:50 PM

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి దర్శనం కోసం వస్తున్న యాత్రికులకు ఆలయం వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో దాదాపు 15 వేల మంది భక్తులు ప్రతిరోజూ శ్రీ గోవిందరాజ స్వామిని కూడా దర్శించుకుంటారు. తిరుపతి రైల్వే స్టేషన్‎కు పక్కనే ఉన్న శ్రీ గోవిందరాజ స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8:30 వరకు స్వామివారికి నిత్య కైకార్యాలు జరుగుతుండగా రాత్రి 9 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో గోవిందరాజ స్వామి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్న భక్తులకు ఆలయం వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. గోవిందరాజ స్వామి దర్శనానికి వెళ్లాలంటే వెంట తెచ్చుకున్న లగేజీతోనే ఆలయ ప్రవేశం చేయాల్సిన రావడం ఇబ్బందికరంగా మారింది. లగేజీ భద్రపరిచేందుకు కౌంటర్‎లు లేకపోవడంతో లగేజీ బ్యాగ్‎లతోనే భక్తులు దర్శనానికి వెళుతున్న పరిస్థితి నెలకొంది.

గత 6 నెలలుగా ఆలయం బయట లగేజీ కీపింగ్ సెంటర్‎ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మూసివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో గోవిందరాజ స్వామిని దర్శించుకుంటున్నడంతో వారి వెంట ఉండే లగేజీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ లగేజీని బయట పెట్టే అవకాశం లేకపోవడంతో భక్తులు లగేజీ బరువుతో స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది. లగేజీ బ్యాగులతో భక్తులు దర్శనానికి వెళుతుండడంతో క్యూ లైన్‎లలో కూడా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు లగేజీ తనిఖీ కూడా అంతంత మాత్రమే ఉండడంతో భద్రత సమస్య కూడా ఆందోళన కలిగిస్తుంది. బ్యాగుల్లో నిషేధిత వస్తువులు తీసుకెళితే భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గత ఆరు నెలలుగా ఈ సమస్య ఉండడంతో ఆలయ సిబ్బంది విషయాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా లగేజీ భద్రపరిచే కౌంటర్లను తెరవకపోవడంతో భక్తులకు లగేజీ భారం మరింతగా పెరిగింది. లగేజీ బ్యాగులతో దర్శనానికి వెళ్లడం కూడా ఎంతో ఇబ్బందిగా మారిందిన్న వాదన భక్తుల నుంచి వినిపిస్తోంది.

ఇక శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద లగేజీ సమస్య 6 నెలలుగా భక్తులను పట్టిపీడిస్తుంటే చెప్పులు వదిలేందుకు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్ ఒకటి నుంచి షూ కీపింగ్ సెంటర్‎ను కూడా మూసి వేయడంతో వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఎక్కడపడితే అక్కడ చెప్పులు వదిలి వెళుతున్న పరిస్థితి ఉంది. లేదంటే చెప్పులు, లగేజీల కోసం యాత్రికుల్లో ఒకరిని కాపలాగా పెట్టి మిగతావారు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయంలోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్య ఇంత తీవ్రంగా మారినా టీటీడీ భక్తుల ఇబ్బందులను అసౌకర్యాన్ని గుర్తించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పిల్లలు ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే జరిగేది ఇదే!
పిల్లలు ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే జరిగేది ఇదే!
సౌందర్యతో సినిమా అంటే నో చెప్పిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..
సౌందర్యతో సినిమా అంటే నో చెప్పిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..
టీమిండియా పొమ్మన్నలేక పొగబెట్టింది.. కట్ చేస్తే.
టీమిండియా పొమ్మన్నలేక పొగబెట్టింది.. కట్ చేస్తే.
విద్యుత్ స్తంభంపైనే కాలి బూడిదైన లైన్‌మెన్..షాకింగ్‌ వీడియో వైరల్
విద్యుత్ స్తంభంపైనే కాలి బూడిదైన లైన్‌మెన్..షాకింగ్‌ వీడియో వైరల్
వినియోగదారులకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఈ రుణాలపై పెరిగిన EMI
వినియోగదారులకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఈ రుణాలపై పెరిగిన EMI
ల్యాప్ టాప్ కొనడానికి ఇదే మంచి సమయం.. అమెజాన్‌లో తగ్గింపుల వరద
ల్యాప్ టాప్ కొనడానికి ఇదే మంచి సమయం.. అమెజాన్‌లో తగ్గింపుల వరద
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
అత్యంత సురక్షితమైన భవనాల్లో ఇదీ ఒకటి.. వైట్‌ హౌజ్‌ ప్రత్యేకతలు
అత్యంత సురక్షితమైన భవనాల్లో ఇదీ ఒకటి.. వైట్‌ హౌజ్‌ ప్రత్యేకతలు
ఇంట్లో గంగాజలం ఉందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఇంట్లో గంగాజలం ఉందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
ట్రంప్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది..!
ట్రంప్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది..!
బరువు తగ్గాలనుకుంటున్నారా ?? ఉదయం అల్పాహారంలో స్మాల్‌ ఛేంజెస్
బరువు తగ్గాలనుకుంటున్నారా ?? ఉదయం అల్పాహారంలో స్మాల్‌ ఛేంజెస్