తొలి రోజే.. ‘పెగాసస్’ పై లోక్ సభలో రభస.. మంత్రివర్గ సహచరులను పరిచయం చేయలేకపోయిన ప్రధాని.. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా..
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే లోక్ సభలో విపక్షాల రభసతో సభ వేడెక్కింది. పెగాసస్ అంశం సభను కుదిపివేసింది. ప్రతిపక్షాల కేకలు, నినాదాల కారణంగా ప్రధాని మోదీ తన కొత్త మంత్రివర్గ సహచరులను సభకు పరిచయం చేయలేకపోయారు.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే లోక్ సభలో విపక్షాల రభసతో సభ వేడెక్కింది. పెగాసస్ అంశం సభను కుదిపివేసింది. ప్రతిపక్షాల కేకలు, నినాదాల కారణంగా ప్రధాని మోదీ తన కొత్త మంత్రివర్గ సహచరులను సభకు పరిచయం చేయలేకపోయారు. వారి స్లొగన్స్ కారణంగా సభా కార్యాకలాపాలు సజావుగా సాగకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు. మోదీ తన కేబినెట్ సహచరులను సభకు పరిచయం చేయబోగా విపక్ష సభ్యుల నినాదాలతో ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే విరమించుకోవలసి వచ్చింది. ఈ దేశంలోని మహిళలు, ఓబీసీలు, రైతు బిడ్డలు మంత్రులు కావడాన్ని బహుశా కొంతమందికి ఇష్టం లేనట్టు ఉంది..అందువల్లే వీరిని పరిచయం చేయడానికి కూడా అనుమతించడం లేదు అని మోదీ అన్నారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన దురదృష్టకరమని, అనారోగ్యకరమని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. పెగాసస్ అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి..దేశ భద్రత ముప్పులో పడిందన్నారు.
మరో వైపు పెగాసస్ అంశంపై సభ మొదట చర్చించాలంటూ సీపీఐ రాజ్యసభలో నోటీసునిచ్చింది. ఇలా ఉండగా తొలుత పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ ..దేశాన్ని కుదిపివేస్తున్న కోవిడ్ పాండమిక్ పై సభలో చర్చించాల్సి ఉందని అన్నారు. ఇంతటి ముఖ్యమైన సమస్యపై సభ్యులు తమ విలువైన సూచనలు, సలహాలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనన్నారు. ఇక రాజ్యసభలో కూడా విపక్షాలు పెగాసస్ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసే సూచనలున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Big Relief: స్వర్ణకారులకు గుడ్‌న్యూస్.. పాత బంగారు నగల విక్రయంపై వచ్చే లాభాలకు మాత్రమే జీఎస్టీ