Big Relief: స్వర్ణకారులకు గుడ్‌న్యూస్‌.. పాత బంగారు నగల విక్రయంపై వచ్చే లాభాలకు మాత్రమే జీఎస్టీ

Good news for jewellers: స్వర్ణకారులకు పెద్ద ఉపశమనం కలిగింది. పాత బంగారు నగల విక్రయంపై జీఎస్‌టీకి సంబంధించి కర్ణాటక అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (AAR) కీలక..

Big Relief: స్వర్ణకారులకు గుడ్‌న్యూస్‌.. పాత బంగారు నగల విక్రయంపై వచ్చే లాభాలకు మాత్రమే జీఎస్టీ
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jul 19, 2021 | 1:03 PM

Good news for jewellers: స్వర్ణకారులకు పెద్ద ఉపశమనం కలిగింది. పాత బంగారు నగల విక్రయంపై జీఎస్‌టీకి సంబంధించి కర్ణాటక అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (AAR) కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన పాత బంగారు ఆభరణాలను వ్యాపారులు విక్రయించటం ద్వారా పొందే లాభాలకు మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని తీర్పులో స్పష్టం చేసింది. ఆభరణాలు విక్రయించే సమయంలో నగ రూపం గానీ, స్వభావం గానీ మార్చకుండా శుభ్రం చేసి మెరుగుపెట్టుకోవచ్చని వెల్లడించింది. సీజీఎస్‌టీ రూల్‌ 32(5) ప్రకారం నిర్ధేశించిన అమ్మకపు ధర, కొనుగోలు ధరల మధ్య వ్యత్యాసంపై మాత్రమే వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లించాలా? వద్దా అనే దానిపై స్పష్టత కోరుతూ ఆద్య గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ అడిగిన వివరణకు సమాధానంగా ఏఏఆర్‌ ఈ విషయాలు పేర్కొంది. దీంతో నగల వ్యాపారులు అమ్మే పాత నగలపై జీఎస్‌టీ భారం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికం గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు బాగానే కలిసొచ్చింది. ఈ మూడు నెలల్లో ఇన్వెస్టర్లు ఈ పథకాల్లో నికరంగా రూ.1,328 కోట్లు మదుపు చేశారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చినట్లయితే ఇది తక్కువే. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో మదుపరులు రూ.2,040 కోట్లు మదుపు చేశారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ.1,779 కోట్లతో పోల్చినా ఇది తక్కువే. పసిడి ధరలు ఆకర్షణీయంగా ఉన్నందున మున్ముందు కూడా ఈ పథకాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా.

ఇవీ కూడా చదవండి:

Credit Card: క్రెడిట్‌ కార్డును ఇలా తెలివిగా వాడుకుంటే మంచిది.. లేకపోతే చిక్కుల్లో పడ్డట్లే..!

Personal Loan: పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా..? రుణం ఎలాంటి సమయాల్లో తీసుకోవాలి..?

Gold: భారత్‌కు బంగారం అత్యధికంగా ఆ దేశం నుంచే వస్తోంది.. పుత్తడి దిగుమతిలో భారత్‌ నాలుగో స్థానం

Latest Articles
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం