ATM Transactions: ఖాతాదారులకు ఆర్బీఐ ఊహించని షాక్.. ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై బాదుడే బాదుడు.!

ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఊహించని షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ పెను భారంగా..

ATM Transactions: ఖాతాదారులకు ఆర్బీఐ ఊహించని షాక్.. ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై బాదుడే బాదుడు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 19, 2021 | 12:29 PM

ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఊహించని షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ పెను భారంగా మారనున్నాయి. ప్రతీ నెలా ఖాతాదారులకు పరిమితిలో ఉచిత ఏటీఎం లావాదేవీలను చేసుకునే సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే రూ. 20 అదనపు ఛార్జీను వసూలు చేస్తూ వస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ ఛార్జీ పెరగనుంది. తాజాగా ఉచిత ఏటీఎం లావాదేవీల కంటే మించి చేసే నగదు, నగదేతర ట్రాన్సాక్షన్స్‌పై అదనపు ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది.

కొత్త ఏటీఎంల ఏర్పాటు, వాటి నిర్వహణ వ్యయం, ఇంటర్‌ఛేంజ్ ఫీజులు పెరగడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. దీనితో 2022 జనవరి 1వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఇకపై ఉచిత ఏటీఎం లావాదేవీలు దాటిన ప్రతీదానికి రూ. 21 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏదిఏమైనా మెట్రో నగరాల్లో 8 ఉచిత ఏటీఎం(5 హోం బ్రాంచ్, 3 వేరేశాఖ) లావాదేవీలను.. అలాగే నాన్-మెట్రో నగరాల్లో 10 ఉచిత ఏటీఎం(5 హోం బ్రాంచ్, 3 వేరే బ్యాంకుల ఏటీఎంల) లావాదేవీలను కొనసాగించనున్నారు.

మరోవైపు ఈ ఏడాది ఆగష్టు 1వ తేదీ నుంచి ఏటీఎంలలో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్‌చేంజ్ ఛార్జీను రూ. 17కు, అర్దికేతర లావాదేవీపై రూ 6కు పెంచేందుకు ఆర్బీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్బీఐ ఇంటర్‌ఛేంజ్ ఫీజ్‌లో మార్పులు చేయక చాలా ఏళ్లయింది. 2012 ఆగస్టులో చివరిసారిగా ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ మారింది. అలాగే ఏటీఎం లావాదేవీలపై అదనపు ఛార్జీలను 2014 ఆగష్టు నుంచి ఒకేలా వసూలు చేస్తోంది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!