Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా..? రుణం ఎలాంటి సమయాల్లో తీసుకోవాలి..?

Personal Loan: మీకు పర్సనల్‌ లోన్‌ కావాలా..? అంటూ చాలా బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఫోన్‌ల మీదే పూర్తి వివరాలు సేకరించి లోన్లు అందిస్తామని చెబుతుంటారు. ఒకప్పుడు..

Personal Loan: పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా..? రుణం ఎలాంటి సమయాల్లో తీసుకోవాలి..?
Personal Loan
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 19, 2021 | 10:21 AM

Personal Loan: మీకు పర్సనల్‌ లోన్‌ కావాలా..? అంటూ చాలా బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఫోన్‌ల మీదే పూర్తి వివరాలు సేకరించి లోన్లు అందిస్తామని చెబుతుంటారు. ఒకప్పుడు బ్యాంకు రుణం కావాలంటే బ్యాంకుల వద్దకు వెళ్లి రోజు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పరంగా రుణం కావాలంటే త్వరగా మంజూరయ్యే విధంగా వచ్చేసింది. కానీ ఉపయోగపడేవాటికే వ్యక్తిగత రుణం తీసుకుంటే మంచిది. బ్యాంకుల వారు రుణాలు ఇస్తున్నారు కదా.. అని తీసుకుంటే తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది.

అత్యవసర పరిస్థితులు

మెడికల్‌, ఫ్యామిలీ తదితర అత్యవసర పరిస్థితుల కోసం లేదా ఉద్యోగం కోల్పోయినప్పడు అప్పటికప్పుడు వచ్చే అవసరాల కోసం పర్సనల్‌ లోన్‌ను తీసుకోవచ్చు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ లోన్‌ కాస్త ఊరటనిస్తుంది. అయితే ఎమర్జెన్సీ ఫండ్‌ను సమకూర్చుకోవడం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం ఇంకా మంచిది.

ఇల్లు విషయంలో..

ఇల్లు నిర్మాణంలో భాగంగా ఇంటిని చక్కదిద్దడానికి లేదా రినోవేషన్‌కు పర్సనల్‌ లోన్‌ను వినియోగిస్తే బాగుంటుంది. ఇంటిని రినోవేషన్‌ చేయడం వల్ల ఇంటి విలువ పెరుగుతుందనుకున్న సందర్భంలోనూ, అలాగే దాని కోసం సరిపడా నిధులు లేనప్పడు వ్యక్తిగత రుణం తీసుకోడంలో తప్పు లేదు. అత్యవసరంగా చేయాల్సిన మరమ్మతులు వంటి వాటినీ పర్సనల్‌ లోన్‌ సహాయంతో చేయవచ్చు. అయితే హౌజింగ్‌ లోన్‌కు టాప్‌అప్‌ లోన్‌ తీసుకుంటే అతి తక్కువ వడ్డీకే రుణం లభించే అవకాశం ఉంది.

ప్రొఫెషనల్‌ కోర్స్‌ సర్టిఫికేషన్‌ కోసం

ఎడ్యుకేషనల్‌ లేదా ప్రొఫెషనల్‌ కోర్స్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ల కోసం పర్సనల్‌ లోన్‌ను తీసుకోవచ్చు. మీ కోసం లేదా పిల్లల కోసం ఈ రుణాన్ని వాడుకోవచ్చు. దానివల్ల కెరీర్‌ అవకాశాలు మెరుగుపడటానికి దోహద పడుతుంది. ప్రమోషన్లు రావడంలో ఉపయోగపడుతుంది. తీసుకుంటున్న పర్సనల్‌ లోన్‌ మీరు ఒక ప్రయోజనాన్ని ఆశించే తీసుకున్నట్టు అవుతుంది. ప్రమోషన్‌ కాకపోతే మరో మంచి ఉద్యోగం అధిక వేతనంతో లభించేందుకు సహాయపడుతుంది.

క్రెడిట్‌ కార్డు రుణాలను తీర్చడానికి

క్రెడిట్‌ కార్డుల మీద ఉన్న రుణాలను తీర్చడానికి పర్సనల్‌ లోన్‌ తీసుకోవడం ఉపయోగపడుతుంది. ఇందుకు మూడు కారణాలను మనం ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఒకటి.. క్రెడిట్‌ కార్డుల మీద చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సంవత్సరానికి సగటున 45 శాతం వరకు క్రెడిట్‌ కార్డు కంపెనీలు వడ్డీని చార్జీ చేస్తాయి. అయితే పర్సనల్‌ లోన్లు 18 శాతం అంతకంటే తక్కువ వార్షిక వడ్డీకే లభిస్తాయి. క్రెడిట్‌ కార్డు రుణాన్ని పర్సనల్‌ లోన్‌ ద్వారా చెల్లిస్తే అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు. రెండోది.. అధిక వడ్డీ రుణాలను తీర్చడానికి పర్సనల్‌ లోన్‌ను ఉపయోగించడం వల్ల క్రెడిట్‌ స్కోర్‌ పెరిగే అవకాశం ఉంటుంది. మూడోది.. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్‌ కార్డు బకాయిలను పర్సనల్‌ లోన్‌తో తీర్చేస్తే అనేక రుణాలు కాకుండా ఒకే ఒక రుణానికి నెలసరి వాయిదాలు చెల్లించవచ్చు. అయితే క్రెడిట్‌ కార్డుల మీద వడ్డీరేట్లను, పర్సనల్‌ లోన్‌ వడ్డీరేట్లతో పోల్చి చూసుకోవడం మంచిది.

రుణం ఎప్పుడు తీసుకోవద్దు..

రుణాలు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకపోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులపాలయ్యే అవకాశం ఉంది. దినసరి ఖర్చులు నిత్యావసర సరుకుల కోసం, ఇంటి అద్దె చెల్లింపులు వంటి ఖర్చులకు పర్సనల్‌ లోన్‌ తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. అలాంటి సందర్భాల్లో ఉన్నారంటే మీరు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్టు అర్థం. వ్యక్తిగత రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తిరిగి చెల్లించకపోతే లేదా ఒక్క ఈఎంఐ ఆలస్యమైనా జరిమానాలు పడడంతోపాటు క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుంది.

అయితే విహారయాత్రల కోసం, ఫర్నీచర్‌ లేదా గాడ్జెట్స్‌ కోసం పర్సనల్‌ లోన్‌ తీసుకోవడం సరైనదేనని చాలామంది భావిస్తారు. కానీ అది తప్పు. విలాసాలకు, వినియోగానికి సంబంధించిన ఖర్చులన్నీ సొంత సొమ్ముతోనే భరించాలి. మొదటి నుంచి పొదుపు చేసి వాటిని పొందడం మంచిది. ఈ విలాసాలను అప్పు చేసి తీర్చుకోవడం ఏ మాత్రం సరైంది కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి

Samsung: శాంసంగ్‌ నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లు.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి.. ఎప్పుడు విడుదలంటే..!

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. మొబైల్‌ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్స్‌

Amazon Gift Voucher: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా రూ.10 వేల గిఫ్ట్ వోచర్‌.. ఈ రెండు షరతులు తప్పనిసరి

ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం
ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం
IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..
IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!
సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!
సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి
ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..
ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..
కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్
కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్
DC vs SRH Preview: వైజాగ్‌లో మరో హైటెన్షన్ మ్యాచ్
DC vs SRH Preview: వైజాగ్‌లో మరో హైటెన్షన్ మ్యాచ్
రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరం..కరెంటు సరఫరా ఎలా అవుతుంది
రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరం..కరెంటు సరఫరా ఎలా అవుతుంది
భారతీయులకు స్మార్ట్‌ఫోన్ మత్తు..రోజుకు ఎన్నిగంటలు వాడుతున్నారంటే?
భారతీయులకు స్మార్ట్‌ఫోన్ మత్తు..రోజుకు ఎన్నిగంటలు వాడుతున్నారంటే?