Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్‌ కార్డును ఇలా తెలివిగా వాడుకుంటే మంచిది.. లేకపోతే చిక్కుల్లో పడ్డట్లే..!

Credit Card: గత ఎనిమిది సంవత్సరాలలో క్రెడిట్‌ కార్డుల సంఖ్య మూడింతలు పెరిగాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు చెబుతున్నాయి. ఈ కార్డుల ద్వారా నెలవారీ..

Credit Card: క్రెడిట్‌ కార్డును ఇలా తెలివిగా వాడుకుంటే మంచిది.. లేకపోతే చిక్కుల్లో పడ్డట్లే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 19, 2021 | 10:53 AM

Credit Card: గత ఎనిమిది సంవత్సరాలలో క్రెడిట్‌ కార్డుల సంఖ్య మూడింతలు పెరిగాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు చెబుతున్నాయి. ఈ కార్డుల ద్వారా నెలవారీ లావాదేవీలు 4.7 రెట్లు పెరిగాయి. దీంతో క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తున్న వారి సంఖ్య, అలాగే ఖర్చు చేస్తున్న సొమ్మూ కూడా పెరిగిపోతోంది. అయితే, క్రెడిట్‌ కార్డు రెండువైపులా పదునున్న కత్తిలాంటిదని గుర్తించుకోవాలి. ఆర్థిక నిపుణుల ప్రకారం.. క్రెడిట్‌ కార్డులను తెలివిగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. లేదంటే మనకు తెలియకుండానే నష్టపోయే ప్రమాదం ఉంది. మరి ఈ కార్డుని ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం..

బిల్లింగ్ విషయంలో కట్టుబడి ఉండండి

ప్రతి క్రెడిట్‌ కార్డుకు 50 రోజుల బిల్లింగ్‌ సైకిల్‌ ఉంటుంది. అంటే మీ బిల్లింగ్‌లోని తొలిరోజు మీరు డబ్బు వాడుకుంటే.. తిరిగి చెల్లించడానికి మీకు 50 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ మీరు మీ బిల్లింగ్‌ లో 30వ రోజు సొమ్మును వినియోగించుకుంటే తిరిగి చెల్లించడానికి మరో 20 రోజులు ఉంటాయి. ఈ సమయంలోపు మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఉదాహరణకు.. జనవరి 10వ తేదీన మీ బిల్లింగ్‌ సైకిల్‌ ప్రారంభమవుతుందనుకోండి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు మీకు క్రెడిట్‌ కార్డు నుంచి ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొత్త స్పెండింగ్‌ సైకిల్‌ ప్రారంభమవుతుంది. అయితే, జనవరి10వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీలోపు వాడుకున్న డబ్బును తిరిగి చెల్లించేందుకు ఫిబ్రవరి 29వ తేదీ వరకు సమయం ఉంటుంది. ఫిబ్రవరి 9వ తేదీ తర్వాత తీసుకున్న మొత్తం మార్చి బిల్లింగ్‌ సైకిల్‌లోకి చేరుతుంది.

నగదు విత్‌డ్రా వద్దు

క్రెడిట్‌ కార్డు పరిమితిలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చేయకూడదు. దీంతో చాలా మంది ఈ కార్డు డెబిట్/ఏటీఎంలా వాడుతుంటారు. అయితే, అత్యవసరమైతే తప్ప.. నగదు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే నగదు తీసుకున్న తర్వాత రోజు నుంచే వడ్డీ ప్రారంభమవుతుంది. దీనికి బిల్లింగ్‌ సైకిల్‌ అంటూ ఏమీ ఉండదు. ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా పెరిగిపోతుంది. దీని వల్ల మీరు మరింతగా నష్టపోయే ప్రమాదం ఉంది.

ఎలాంటి ఛార్జీలు.. ఎంత మొత్తం వర్తిస్తాయి?

చాలా మంది క్రెడిట్‌ కార్డు తీసుకునేటప్పుడు ఎలాంటి ఛార్జీలు వర్తిస్తాయో, ఎలాంటి చార్జీలు వర్తించవు అనే విషయాన్ని పెద్దగా తెలుసుకుని ఉండరు. కంపెనీ ఏజెంట్లు చెప్పింది విని తీసేసుకుంటారు. ఏయే ఛార్జీలు, ఎంత మొత్తంలో వర్తిస్తాయో తప్పకుండా తెలుసుకోవడం మంచిది. బిల్లింగ్‌ సైకిల్‌ అయిపోయిన తర్వాత పడే వడ్డీ రేటు ఎంతో చాలా మందికి తెలియదు. ఇలాంటివి అడిగి తెలుసుకోవాలి. అలాగే కార్డును బట్టి వడ్డీ రేటు మారుతుంటుంది. కొన్ని ప్రీమియం కార్డుల్లో వడ్డీరేటు తక్కువ ఉంటుంది. కానీ, నిర్ణీత గడువులో ఇంత మొత్తం ఖర్చు చేస్తేనే తక్కువ వడ్డీరేటు వర్తిస్తుందన్న షరతులు ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడం తప్పనిసరి.

‘మినిమం ఎమౌంట్‌ డ్యూ’ చిక్కుల్లో పడవద్దు..

మీరు చెల్లించాల్సిన మొత్తంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదంటూ మీకు బ్యాంకుల నుంచి ఫోన్‌లు, మెసేజ్‌లు వస్తుంటాయి. దాన్ని చూసి మీరు ఎలంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే మీరు తర్వాత బిల్లింగ్‌ సైకిల్‌లో చేసే తొలి కొనుగోలు నుంచి బాకీ ఉన్న మొత్తానికి వడ్డీ పడుతూ ఉంటుంది. ఉదాహరణకు.. మీరు అక్టోబర్‌ 29 నాటికి రూ.10 వేలు చెల్లించాలి. కానీ, రూ.5,000 చెల్లిస్తే వడ్డీ ఏమీ ఉండదు అనడంతో మీరు అంతమొత్తం చెల్లించారనుకోండిఅనుకుందాం. ఇక మీరు తిరిగి నవంబర్‌ 5న మరో రూ.2,000 ఖర్చు చేశారనుకోండి. అప్పటి నుంచి మీకు రూ.5000+రూ.2,000లకు వడ్డీ పడడం ప్రారంభమవుతుంది. ఇలా క్రెడిట్‌ కార్డులను తీసుకోవడంలో తప్పు లేదు. కానీ మనం వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే పెద్ద ప్రాసెస్‌ ఉండేది. అది కూడా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. కానీ ప్రస్తుతం క్రెడిట్‌ కార్డు పొందాలంటే చాలా సులభంగా ఇచ్చేస్తున్నారు. కార్డులో ఉన్న మొత్తాన్ని వాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే చిక్కుల్లో పడిపోవడం ఖాయం.

ఇవీ కూడా చదవండి

Personal Loan: పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా..? రుణం ఎలాంటి సమయాల్లో తీసుకోవాలి..?

Samsung: శాంసంగ్‌ నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లు.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి.. ఎప్పుడు విడుదలంటే..!